నేలకొండపల్లి కార్యకర్తలతో పొంగులేటి సమావేశం అయ్యారు. డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదని.. తెలిపారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై పొంగులేటి సీరియస్ అయ్యారు మరియు ఎమ్మెల్యేకు ప్రజలే బుడ్డి చెప్తారని సమావేశంలో పేర్కొన్నారు.
Tummala Nageshwar Rao To Join Congress Party ?: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.
Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకీ తానెక్కడి నుంచి పోటీచేస్తారనేదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయింది. ఆ ఫుల్ డీటేల్స్ మీ కోసం.
Ys Jagan-Ponguleti: ఓ వైపు తెలంగాణ ఎన్నికలు మరోవైపు ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఆ నేత హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం.
Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Minister Harish Rao vs Rahul Gandhi: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతోందని.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి ఏ గతి అయితే పట్టిందో.. రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అంటూ ఖమ్మం జనగర్జన బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
ఖమ్మంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి అంతుచూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లపై రాశారు. పూర్తి వివరాలు ఇలా..
Pidamarthi Ravi Joins in Congress: బీఆర్ఎస్కు సీనియర్ నేత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను రిలీజ్ చేశారు.
Revanth Reddy Challenge To CM KCR: జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సవాల్ విసిరారు.
35 BRS Leaders To Join Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయా ? బీఆర్ఎస్ పార్టీ నుంచి పదుల సంఖ్యలో నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? మరీ ముఖ్యంగా ఒక్క కాంగ్రెస్ పార్టీలోకే 35 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.
Bandi Sanjay Comments on Ponguleti Srinivas Reddy, Jupalli Krishna Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారిలో పోతుంటే మహిళలు ఇండ్లలోకి పోయి దాచుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీ పోరాటాలకు భయపడి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటే అని బండి సంజయ్ ఆరోపించారు.
Revanth Reddy Slams BRS: ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలతో నోటికి పని చెబుతున్నారు. ఖమ్మంలో కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారంటూ పొంగులేటిపై మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు.
KA Paul on Poguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని కేఏ పాల్ కోరారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. పొంగులేటిని డిప్యూటీ సీఎంను చేస్తానని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో ఎప్పుడు చేరతారో చెబితే.. లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
ఇటీవల బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏ పార్టీలో చేరతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరికకు మూహుర్తం ఫిక్స్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.