స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టిన ఘటనపై భారత్‌కు బ్రిటన్ క్షమాపణ చెప్పింది. బుధవారం లండన్ పార్లమెంట్ సమీపంలో కొందరు నిరసనకారులు భారత త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టారు. బ్రిటన్ పర్యటనలో సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్థాన్, కశ్మీరీ ఆందోళనకారులు పార్లమెంట్ స్క్వేర్ వద్దకు చేరుకుని అక్కడ ఎగురుతున్న భారత త్రివర్ణ పతాకాన్ని కిందికు లాగి తగలబెట్టారు. అనంతరం ఖలిస్థాన్ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉండడం గమనార్హం.
ఫాలోవర్స్‌కు సంబంధించిన తాజా డేటాను ట్విట్టర్ విడదల చేసింది. ఈ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ 67 శాతం నకిలీ ఫాలోవర్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తేలింది. బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధరూర్, భారత ప్రధాని మోడీ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరందరికీ సిసలైన ఫాలోవర్లకంటే నకిలీ ఫాలోవర్లు ఉండటం గమనార్హం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.