హైదరాబాద్ కు మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 28న ప్రధాని మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రోలో ట్రావెల్ చేసే ప్రయాణికులకు అధికారులు పలు షరతులు విధించారు. ...మెట్రో రైల్లో కానీ.. స్టేషన్లో కానీ పాటించే నింబంధనలకు సంబంధించిన ఓ జాబితా విడుదల చేయారు.. అవేంటో తెలుసుకుందామా మరి...!
జంటనగరాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవంపై నీలినీడకల కమ్మకున్నాయి. ఈ నెల 28న ప్రాంభించాలని భావిస్తున్న మోట్రోకు ఇంకా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) పూర్తిగా స్థాయిలో అనుమతులు రాలేదు..నాగోల్ నుంచి మెట్టుగూడకు.. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు గల రూట్లకు అనుమతి ఇచ్చిన సీఎంఆర్ఎస్ ....మధ్యలో కీలకమైన మెట్టుగూడ - ఎస్ఆర్ నగర్ మార్గానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
నగరవాసుల ఎదురుచూపులు తీరనున్నాయి... మెట్రో సర్వీసులు లాంఛనంగా ప్రారంభించేందుకు నవంబర్ 28న ముహూర్తం ఖరారయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాదు మెట్రో రైలు పట్టాలపై కూత పెట్టనుంది. ఈ ప్రాజెక్టును మియాపూర్ డిపోలో ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. మెట్రో ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సెప్టెంబర్ లో దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే..!
హైద్రబాద్ మెట్రో ప్రారంభోత్సవం ప్రధాని మోడీతో ముడిపడిఉంది. నవంబర్ 28న ప్రారంభించాలని భావిస్తున్న టి.సర్కార్ .. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోడీకి ఆహ్వానం పలికారు. అయితే ఇప్పటి వరకు ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. సమాచారం అందిన వెంటనే ప్రారంభోత్సవం తేదీని అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సికింద్రాబాద్ ఓలిఫెంటా వద్ద మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మెట్రో ట్రాక్ పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండో దశపై ప్రణాళికలు రూపొందించామన్నారు.
భాగ్యనగరంలో మెట్రో రైలు పట్టాలెక్కే మూహుర్తం ఖరారైంది. నవంబర్ నెలలో ప్రధాని చేతుల మీదుగా మోట్రో రైలు ప్రారంభించాలని టి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ గురువారం లేఖ రాశారు.
ఎట్టకేలకు హైదరాబాద్ వాసులకు మెట్రో కల నెరవేరబోతుంది. ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మెట్రో సర్వీసులు ప్రారంభానికి ముహర్తం కుదిరింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి మెట్రో సరీసులు ప్రారంభించాలని టి. సర్కార్ ప్రాధమిక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ పనులు సవ్యంగా జరిగితే ఇది అమలుకు నోచుకుంటుందని సంబధిత అధికారులు పేర్కొన్నారు. సాధ్య సాధ్యలను సమీక్షించి అధికారిక ప్రకటన చేస్తామంటున్నారు. తొలి విడతగా రెండు కారిడార్లలో ప్రారంభోత్సవానికి అధికారులు యుద్ధప్రాతిపదకన ఏర్పాట్లు చేుస్తున్నారు. నాగోలు నుంచి బేగంపేట వరకు..అలాగే మియాపూర్ నుంచి అమీర్పేట వరకు గల మెట్రో పనులను యుద్ధప్రాదికన నడుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.