బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న గురువారం రూ.150 పెరిగి రూ.32,000 వద్ద ట్రేడ్ అయిన తులం బంగారం ఇవాళ రూ.230 పెరిగి రూ.32,230కి చేరింది. దేశంలో జువెలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటమే ఈ ధరల పెంపునకు కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బులియన్ మార్కెట్లో నిన్న గురువారం రూ.130 తగ్గి రూ.37,750 పలికిన కిలో వెండి ఇవాళ రూ.250 పెరిగి రూ.38,000లకు చేరుకుంది. నాణేల తయారీదారులతోపాటు పరిశ్రమవర్గాల నుంచి డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.
బంగారం ధర భారీ స్థాయిలో పడిపోయింది. గ్రాముకు రూ. 405 తగ్గి..10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 31,965 వరకు చేరింది. దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడంతో బంగారం ధర పడిపోయినట్లు తెలిసింది.మరో వైపు వెండి కూడా బంగారాన్ని అనుసరించింది. అది కూడా అమాంతంగా తగ్గిపోయి... కిలో వెండి ధర. 370కి తగ్గి 40,830 కి చేరుకుంది. బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో జ్యూవెలరీ షాపులకు మగువలు క్యూ కడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.