న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మనీకంట్రోల్.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం కేంద్రం ప్రస్తుతం బంగారానికి సంబంధించి ఓ ప్రత్యేక చట్టానికి తుది మెరుగులు దిద్దుతోంది. ఆ తర్వాత త్వరలోనే గోల్డ్ బోర్డు ఏర్పాటు చేయనుంది. అందులోని నియమనిబంధనల ప్రకారం బంగారం దాచుకునేందుకు ఓ పరిమితి విధించనున్నారు. ఆ పరిమితికి మించి బంగారం దాచుకున్నట్టయితే, అలా దాచుకున్న బంగారానికి తప్పనిసరిగా లెక్కలు చెప్పాల్సిందే. అక్రమంగా దాచిన బంగారంపై గోల్డ్బో ర్డ్ పన్ను విధించనుంది. బంగారం కొనుగోలుకు పరిమితులు, విధివిధానాలను గోల్డ్ బోర్డు ఖరారు చేయనుందని సమాచారం.