దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం-2019పై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణపై సుప్రీం కోర్టు స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉన్న ఐజీఎస్టీ నిధులను(IGST funds) కేంద్రం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన రూ.35,298 కోట్ల నిధులలో భాగంగానే తెలంగాణకు రావాల్సి ఉన్న రూ.1,036 కోట్లను సైతం విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
ఉల్లి ధరలు కోయకుండానే సామాన్య మానవుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదే విషయమై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద అన్నీ పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ సభ్యులు తమ నిరసన తెలియజేశారు.
ఉల్లిగడ్డల ధరల పెరుగుదల వెనుక కేంద్ర ప్రభుత్వం భారీ కుంభకోణం దాగి ఉందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఉల్లిగడ్డల మాల ధరించి పెరుగుతున్న ఉల్లి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సహకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
విభజన హామీలు నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు చేస్తూ వచ్చిన టీడీపీ..మరోమారు లోక్ సభలో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం లోక్ సభ సెక్రటరీ జనరల్ కు టీడీపీ ఎంపీ కేశినేని అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు.
ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపుబడ్డ తాజ్మహల్ మనకు ఎప్పటికీ వెలకట్టలేని ఆస్తిగానే మిగిలిపోతుంది. అలాంటి అందమైన,చిరస్మరణీయమైన కట్టడంపై పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇది సామన్య జనాల వాయిస్ కాదు ..ఏకంగా అత్యున్నత ధర్మాసనమే చెప్పింది.
తల్లిదండ్రులు, వృద్దుల పోషణ, సంక్షేమం చట్టం 2007ను ప్రభుత్వం సమీక్షిస్తోందని కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
అధికారిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు ‘దళిత్/దళితులు' అనే పదాన్ని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశించింది.
తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. నిర్ధారణ లేకుండా వీటిని రాసే జర్నలిస్టుల గుర్తింపును (అక్రిడిటేషన్) శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.