ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

Last Updated : Sep 11, 2018, 09:26 AM IST
ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు 2016–17 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. వీటిలో గుమాస్తా, ఆఫీసు అసిస్టెంట్‌ లాంటివే ఎక్కువగా ఉన్నాయట. లక్షల ఉద్యోగాలు భర్తీ కాకపోవడానికి కారణం.. ఉన్న ఉద్యోగులకు కేంద్రం భారీగా జీతాలు చెల్లిస్తుండటమేనని సర్వే పేర్కొంది. 2006–07 నుంచి 2016–17 వరకు కేంద్ర ఉద్యోగుల వేతనాల ఖర్చు మూడు రెట్లు పెరిగిందని తెలిపింది. 2006–07లో జీతాల కోసం కేంద్రం దాదాపు రూ. 40వేల కోట్లు ఖర్చుచేయగా, 2016–17కు వచ్చేసరికి రెండు లక్షల కోట్లకు పెరిగిందని.. ఈ పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతనాలు మూడు సార్లు పెరిగాయంది.

సిబ్బందిలేమితో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల అమలు సంతృప్తికరంగా సాగడం లేదని ఏడవ వేతన సంఘం తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికాలో ప్రతి లక్ష మంది ప్రజలకు 668 మంది ఉద్యోగులు ఉంటే.. మన దేశంలో లక్ష మందికి 139 మంది ఉద్యోగులే ఉన్నారని సర్వే తెలిపింది.

7 వేల నుండి 18వేల వరకు

ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించడం కోసం వేతనాలను పెంచాలని కేంద్రానికి ఏడవ వేతన సంఘం సిఫారసు చేసింది. దానికనుగుణంగా కేంద్రం ఉద్యోగుల కనీస వేతనాన్ని ఏడు వేల రూపాయల నుంచి 18వేలకు పెంచింది. 2015–16 వరకు ఉద్యోగి వేతనంలో మూల వేతనం 36 శాతం ఉంటే.. ఏడో వేతన సంఘం సూచన మేరకు 2016–17 నుంచి మూల వేతనం 66 శాతం అయింది.

Trending News