హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఏరియా గాంధీనగర్ నివాసైన కేసీఆర్ బాల్యమిత్రుడు కె. రాజేంద్రప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ తన బాగోగులు అడిగి తెలుసుకున్నారట
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాంకా ట్రంప్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు. నవంబర్ 29వ తేదీ గోల్కొండ కోటలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విందుకు ఇవాంకా ట్రంప్ హాజరవుతారు.
రాష్టవ్య్రాప్తంగా సోమవారం రాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా జెన్కో-ట్రాన్స్‌కో ఏర్పాట్లను పూర్తిచేసింది. ఐదారు రోజులపాటు ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఎదురయ్యే ప్రభావాన్ని అన్ని కోణాల్లో అంచనా వేసి తదుపరి కార్యాచరణను రూపొందిస్తారు.
సూర్యాపేటలో జిల్లా కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి గురువారం హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనతంత త్వరగా పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే సూర్యాపేటను జిల్లాగా ప్రకటిస్తామన్న హామీని టీఆర్ఎస్ నెరవేర్చిందని ఆయన తెలిపారు. అలాగే నాగార్జునసాగర్ ఏలేశ్వరం ప్రాంతం దగ్గర తొలుత నిర్మించాలని భావించారని.. కాకపోతే అప్పటి అధికార కాంగ్రెస్ నాయకులు చేసిన దగా వలన స్థలం మారిందని అభిప్రాయ పడ్డారు.
సింగరేణి కార్మికులతో ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై అనేక అంశాల మీద చర్చించారు. వారి ఇంటి నిర్మణాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. తొలుత టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ముఖ్యమంత్రి, గతంలో తమ సొసైటీ అధికారంలోకి వచ్చినా పనులు ఆశించినంత రీతిలో జరగలేదని, కానీ ప్రస్తుతం సింగరేణి కార్మికుల సమస్యలను తొలిగించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని..
సింగరేణి ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీలవుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ హనుమంతరావు విమర్శించారు. కేసీఆర్ తన సొంత కూతురిని గెలిపించడం కోసం ఎన్నికలలో లాబీయింగ్ చేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గెలిచిన తెరాసకు, తమకు కేవలం నాలుగు వేల ఓట్లు మాత్రమే తేడా అని.. తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని నేతగా ఎదిగిన కోదండరామ్ లాంటి వారినే తిట్టడం కేసీఆర్ స్వభావమని.. ఆయన భాష ఆక్షేపణీయంగా ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.