WTC Prize Money: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ప్రైజ్‌మనీపై ICC ప్రకటన

WTC Prize Money In Indian Rupees: సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య జూన్ 18న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాపంయిన్‌షిప్ పైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ భారీ మొత్తంలో అందించనుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 15, 2021, 09:49 AM IST
  • జూన్ 18న భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం
  • విజేతగా నిలిచిన జట్టుకు భారత కరెన్సీలో రూ.11 కోట్ల 72 లక్షలు ప్రైజ్‌మనీ
  • రన్నరప్, ఇతర దేశాల జట్లకు ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ
WTC Prize Money: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ప్రైజ్‌మనీపై ICC ప్రకటన

WTC Prize Money In Indian Rupees: ఐసీసీ నిర్వహించనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిన్ ఫైనల్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే అందరూ చర్చించుకుంటున్న అంశం ప్రైజ్‌మనీ. ఎలాగైతే ఐపీఎల్ ఫైనల్ సమయంలో నగదు విషయం చర్చకు వస్తుందో, ప్రస్తుతం ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ప్రకటించింది. 

సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య జూన్ 18న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final 2021) పైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ 1.6 మిలియన్ అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో దాదాపుగా రూ. 11 కోట్ల 72లక్షలు) ఐసీసీ అందజేయనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన జట్టుకు రన్నరప్ ప్రైజ్‌మనీ 8 లక్షల అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా రూ.5.86 కోట్లు) అందిస్తారు. వన్డేలు, ట్వంటీ20లకు ప్రతిష్టాత్మకంగా వన్డే, టీ20 ప్రపంచ కప్‌లు నిర్వహిస్తున్నారు. అయితే క్రికెటర్ల అసలుసిసలైన సత్తా చాటిచెప్పే టెస్టులకు ప్రాధాన్యం కల్పించాలని ఐసీసీ తొలిసారిగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది.

Also Read: WTC Final 2021: ఆ సిరీస్‌లో Team India విజయాన్ని జీవితంలో మరిచిపోలేను, Ajinkya Rahane

ఐసీసీ నిర్వహిస్తున్న ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 4.5 లక్షల అమెరికా డాలర్లు (రూ.3 కోట్ల 30 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 3.5 లక్షల అమెరికా డాలర్లు (రూ.2 కోట్ల 56 లక్షలు), ఐదో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.1 కోటి 47 లక్షలు ప్రైజ్‌మనీ అందించనున్నామని ఐసీసీ ప్రకటించింది. ఇతర దేశాల జట్లకు భారత (Team India) కరెన్సీలో దాదాపు రూ.73 లక్షల వరకు ఇస్తారు.

Also Read: WTC Final 2021: ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో బౌలింగ్‌కు సై అంటున్న Team India కెప్టెన్ Virat Kohli

మ్యాచ్ డ్రా లేక టై అయితే..
గతంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలిచే జట్టుకు ఛాంపియన్‌షిప్ గదను బహుకరించేవారు. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేస్తారు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ డ్రా లేదా టై అయితే విజేత, రన్నరప్ ప్రైజ్‌మనీని సమానంగా పంచుతారు. డబ్ల్యూటీసీ విన్నర్ ట్రోఫీని భారత్, న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా షేర్ చేసుకుంటాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News