Nitu Ghanghas wins Gold Medal in WWBCH: ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో భారత్ కి బంగారు పంట పండించారు నీతూ ఘన్‌ఘాస్, సావిటి బూర. 48 కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెగ్‌పై భారత్‌కి చెందిన బాక్సర్ నితు ఘన్‌ఘాస్ 5-0తో ప్రత్యర్థిని మట్టి కరిపించి భారత్ కి గోల్డ్ మెడల్ అందించింది. ఆ తరువాత 81 కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై సావీటీ బూరా విజయం సాధించి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో గోల్డ్ మెడల్ అందించింది.
CHAMPION 🏆🥇
Nitu is a World Champion 💪🤩
Book your tickets for the final 🔗 on 🔗:https://t.co/k8OoHXo2BA@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @IBA_Boxing @NituGhanghas333 pic.twitter.com/C19mVQybrT
— Boxing Federation (@BFI_official) March 25, 2023
48 కేజీల విభాగంలో మంగోలియా పగిలిస్ట్ లుత్‌సాయిఖాన్‌తో నీతు ఘన్‌ఘాస్ పోరాటం వన్ సైడ్ వార్‌ని తలపించినప్పటికీ.. 81 కేజీల విభాగంలో సావీటీ బూర, వాంగ్ లీనాల మధ్య బాక్సింగ్ పోరు హోరాహోరీగా కొనసాగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అంతిమంగా సావిటీ బూర స్వల్పంగా ఆదిక్య సాధించి 4-3 తేడాతో విజయం సాధించింది. చివరి వరకు విజయం ఇరువురి మధ్య దోబూచులాడినప్పటికీ.. బూర బాక్సింగ్ పంచ్ ముందు వాంగ్ లీనా తలవంచక తప్పలేదు.
SAWEETY WINS A HISTORIC 🥇🥊💪
2014 : 🥈 2023 : 🥇
Incredible 😍@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionship @IBA_Boxing @Media_SAI @saweetyboora pic.twitter.com/6RvYnF57uT
— Boxing Federation (@BFI_official) March 25, 2023
ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన ఆరో భారతీయ మహిళగా నీతూ ఘన్‌ఘాస్ నిలవగా.. ఏడో స్థానంలో సావీటీ బూర నిలవడం విశేషం. మొత్తానికి ఈ టోర్నమెంట్‌లో రెండు వేర్వేరు కేటగిరీల్లో రెండు గోల్డ్ మెడల్స్ భారత్ వశమయ్యాయి.
ఇది కూడా చదవండి : MS Dhoni Record: ఐపీఎల్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టడంలో నెం.1గా ఎంఎస్ ధోని..ఇది కదా కిక్కు!
ఇది కూడా చదవండి : IPL2023 New Rules: ఐపీఎల్ 2023లో మారిన కొత్త నిబంధనలేంటి, ఇంపాక్ట్ ప్లేయర్, టాస్ , డీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది
ఇది కూడా చదవండి : Sanju Samson: భారత జట్టులోకి రావాలంటే.. సంజూ శాంసన్ ఇంకా ఏం చేయాలి! బీసీసీఐని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK