Carlos Alcaraz is the new Wimbledon champion: వింబుల్డన్‌కు కొత్త రారాజు వచ్చాడు. ఫైనల్లో టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ ను మట్టికరిపించి.. టైటిల్ ఎగరేసుకుపోయాడు స్పెయిన్ యువకెరటం అల్కరాస్. తొలి సెట్ ఓడిపోయినా సరే తర్వాత అల్కరాస్ పుంజుకున్న తీరు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. ఫైనల్ అంటే ఇలానే ఉండాలనే తీరులో ఆడారు వీరిద్దరూ. ఈ మ్యాచ్ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది.
ఆదివారం ఎంతో హోరాహోరీగా సాగిన వింబుల్డన్ ఫైనల్లో టాప్‌సీడ్ స్పెయిన్ యువ సంచలనం అల్కరాస్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండోసీడ్ జకోవిచ్‌పై విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన మారథాన్ పోరులో.. తొలి సెట్ ఓడినప్పటికీ విజయం మాత్రం ప్రపంచ నంబర్‌వన్ అల్కరాస్నే వరించింది. లండన్‌లోని సెంటర్ కోర్ట్‌లో జరిగిన షోలో జకోవిచ్ 6-1తో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. టైబ్రేకర్లోకి వెళ్లిన రెండో సెట్లో అల్కరాజ్ అద్భుతంగా పుంజుకుని 7-6 (8/6)తో గెలుచుకున్నాడు. స్పెయిన్ ఆటగాడు తన ఆధిపత్యాన్ని కొనసాగించి మూడో సెట్‌ను 6-1తో కైవసం చేసుకున్నాడు. అయితే అద్భుతంగా పుంజుకున్న జకోవిచ్ నాలుగో సెట్ ను 6-3తో గెలుచుకుని.. మ్యాచ్ ను చివరి సెట్ తీసుకెళ్లాడు.
Also Read: Wimbledon 2023 final: వింబుల్డన్ విజేతగా వొండ్రుసోవా.. తొలి అన్ సీడెడ్ ఫ్లేయర్ గా రికార్డు..
చివరి సెట్ సాగిందిలా..
నిర్ణయాత్మకమైన ఐదో సెట్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానులను ఊపేసింది. ఇద్దరూ ఆటగాళ్లు పాయింట్ పోతే ప్రాణం పోతుందన్నట్లుగా తలపడ్డారు. తొలి గేమ్‌లో జకో, రెండో గేమ్‌లో అల్కరాస్ గెలుపొందారు. మూడో గేమ్‌లో జకో సర్వీస్‌ను అల్కరాస్ బ్రేక్ చేశాడు. ఆపై తన సర్వీస్ నిలబెట్టుకున్న అల్కరాస్ 3-1తో ఆధిక్యం సాధించాడు. దీంతో కోపం పట్టలేక జకో రాకెట్‌ను విరగ్గొట్టాడు. అయితే ఇదే ఊపులో ఐదో గేమ్ లో గెలిచాడు జకో. దీంతో ఆధిత్యం 2-3కు తగ్గించగలిగాడు. వెంటనే గేమ్ నెగ్గి అల్కరాస్ 4-2తో విజయం దిశగా సాగాడు. అయితే జకోవిచ్ కు అవకాశం ఇవ్వకుండా సర్వీస్ ను నిలబెట్టుకుున్నాడు ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు. ఈ మ్యాచ్ లో అల్కరాస్ 9 ఏస్‌లు, 66 విన్నర్లు కొట్టాడు.
Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి