VVS Laxman to Head Coach Team India for New Zealand tour after Rahul Dravid gets break: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో రోహిత్ సేన ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత్.. ఇప్పుడు మరో పర్యటనకు సిద్దమవుతోంది. టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఆస్ట్రేలియాలో ఉన్న భారత ప్లేయర్స్ కొందరు నేరుగా కివీస్ వెళ్లనున్నారు.
న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. నవంబర్ 18న ఈ టూర్ ఆరంభం కానుంది. 18న వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ పర్యటనకు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీకి బీసీసీఐ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో కివీస్ టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్‌కు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు. హార్దిక్, ధావన్ ఇటీవల జరిగిన పర్యటనలలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తుందని సమాచారం. దాంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్ గైహాజరీలో టీమిండియా మాజీ పప్లేయర్ లక్ష్మణ్ గతంలో హెడ్ కోచ్‌గా పనిచేశారు. అయితే టీ20 ప్రపంచకప్ 2022కు ముందే రాహుల్ విశ్రాంతి తీసుకున్నాడు కదా.. ఇప్పుడు ఎందుకు అని నెటిజన్లు మండిపడుతున్నారు.
న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లు ఇవే:
టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
వన్డే జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
Also Read: సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్లు ఇవ్వొచ్చు.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే: గవాస్కర్
Also Read: Aadhar Update: ఆధార్‌లో కొత్త మార్పులు.. తప్పక తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook