Umesh Yadav Blessed With Baby Girl: ఇటీవలె తండ్రి మరణంతో బాధలో ఉన్న టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ ఇంట సంతోషకరమైన వాతావరణం నెలకొంది. మహిళా దినోత్సవం సందర్భంగా వారి ఇంటి ఆడబిడ్డ వచ్చింది. ఉమేశ్ యాదవ్ సతీమణి తాన్య నేడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కూతురు పుట్టిన విషయాన్ని ఉమేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 'కూతురు పుట్టింది. పేరెంట్స్‌గా గర్వపడుతున్నాం..' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఉమేష్ యాదవ్, తాన్య 2013 సంవత్సరంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఉమేష్ యాదవ్ దంపతులకు ఒక కూతురు పుట్టింది. తండ్రి మరణంతో ఉమేష్ ఇంట్లో విషాదం నెలకొనగా.. తాజాగా పండంటి ఆడబిడ్డ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Blessed with baby girl ❤️ pic.twitter.com/nnVDqJjDGs
— Umesh Yaadav (@y_umesh) March 8, 2023
ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ ఫిబ్రవరి 22న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన బొగ్గు గనిలో పనిచేస్తూనే ఉమేష్‌ను అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా జట్టుతో ఉన్న ఉమేష్ యాదవ్‌కు మూడో టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్ రాగా.. నాలుగో టెస్టుకు ముందు శుభవార్త వచ్చింది. మూడో టెస్టులో తుదిజట్టులో స్థానం దక్కించుకున్న ఉమేష్.. మూడు వికెట్లతో రాణించాడు.
రంజీ క్రికెట్‌లో సూపర్ పర్ఫామెన్స్ తరువాత ఉమేశ్‌కు టీమిండియాలో అవకాశం దక్కింది. 2010లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వేలంలో కొనుగోలు చేసింది. 2010లో జింబాబ్వే పర్యటనలో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఉమేష్.. నవంబర్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2012లో శ్రీలంకపై టీ20 అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇప్పటివరకు మొత్తం 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు.
Also Read: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తప్పదా, రేపు ఏం జరగనుంది
Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook