CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం

CSK Beat GT By 63 Runs In TATA IPL 2024: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌ను చేజిక్కించుకుని సత్తా చాటింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 27, 2024, 12:23 AM IST
CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జోష్‌ మీద ఉంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై తొలి మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను కూడా చిత్తు చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (జీటీ)ను 63 పరుగుల తేడాతో చెన్నై భారీ విజయం సాధించింది. యువ కెప్టెన్‌లలో శుభ్‌మన్‌ గిల్‌పై రుతురాజ్‌ గైక్వాడ్‌ పైచేయి సాధించాడు.

Also Read: Nitish Rana: రెచ్చగొడితే రచ్చరచ్చే.. ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన బౌలర్‌కు భారీ జరిమానా

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 206 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర (20 బంతుల్లో 46: ఆరు ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ భారీ స్కోర్‌కు పునాది వేశారు. యువ ఆటగాడు శివమ్‌ దూబే (23 బంతుల్లో 51: రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించాడు. డారిల్‌ మిచెల్‌ (24), సమీర్‌ రిజ్వీ (14)తోపాటు అజింక్యా రహనే (12) భారీ స్కోర్‌ నమోదులో తమ పాత్ర పోషించారు. టాపార్డర్‌, మిడిలార్డర్‌ కలిసి ఈ సీజన్‌లో అత్యధిక లక్ష్యాన్ని చెన్నై జట్టు గుజరాత్‌ ముందుంచింది. బౌలింగ్‌కు దిగిన గుజరాత్‌ ప్రత్యర్థి జట్టు స్కోర్‌ బోర్డును నియంత్రించడంలో విఫలమైంది. ప్రతి ఒక్క బౌలర్‌ 30 నుంచి 50 వరకు పరుగులు సమర్పించుకున్నారు. రెండు వికెట్లు తీసిన రషీద్‌ ఖాన్‌ 49 పరుగులు ఇచ్చుకున్నాడు. రవి శ్రీనివాసన్‌ సాయి కిశోర్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్‌ శర్మ చెరొక వికెట్‌ తీశారు.

Also Read: RCB Vs PBKS: విరాట్‌ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి తొలి విజయం.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌ ఓటమి

 

బౌలింగ్‌లో విఫలం కాగా గుజరాత్‌ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. ఓపెనర్లు శుభారంభం చేయకపోగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి గుజరాత్‌ టైటాన్స్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ (8) బ్యాట్‌ ఝుళిపించడంతో తడబడి మైదానం వీడాడు. వృద్ధిమాన్‌ సాహ (21) తన శక్తిమేర ప్రయత్నించగా.. సాయి సుదర్శన్‌ (37) భారీ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్‌ మిల్లర్‌ (21), వృద్ధిమాన్‌ సాహ (21), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (11) మోస్తరు పరుగులు సాధించినా విజయం వైపు పయనించలేదు.

బౌలింగ్‌లో విఫలమైన గుజరాత్‌ బ్యాటింగ్‌లోనూ తడబడి ఈ సీజన్‌లో తొలి ఓటమిని రుచి చూసింది. బ్యాటింగ్‌లో సత్తా చాటిన చెన్నై జట్టులో బౌలర్లు కూడా అదే రీతిలో రెచ్చిపోయారు. గుజరాత్‌కు విధించిన భారీ లక్ష్యాన్ని బౌలర్లు కాపాడారు. ప్రత్యర్థి జట్టు పరుగులు సాధించకుండా బౌలర్లు నియంత్రించారు. దీపక్‌ చాహర్‌, ముస్తఫిజర్‌ రహమాన్‌, తుషార్‌ దేశ్‌పాండే రెండేసి వికెట్లు పడగొట్టారు. డేరిల్‌ మిచెల్‌, మతీష పతిరణ ఒక్కో వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ధోనీ మార్గనిర్దేశత్వంలో..
రెండు జట్లకు ఇద్దరు యువ కెప్టెన్లు అయ్యారు. గుజరాత్‌కు శుభ్‌మన్‌ గిల్‌, చెన్నైకు రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో రెండు జట్లు తడబడ్డాయి. సీనియర్ల గైడెన్స్‌లో ఇద్దరు యువ నాయకులు తలబడగా రుతురాజ్‌ గైక్వాడ్‌ పైచేయి సాధించాడు. జట్టులో అనధికార మెంటార్‌గా ఉన్న సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ అడుగులు వేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీని చిత్తు చేసిన చెన్నై రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి సత్తా చాటింది. మరోసారి ట్రోఫీ కొట్టి ధోనీ చివరి ఐపీఎల్‌ను చిరస్మరణీయంగా మలచాలని చెన్నై ఫ్రాంచేజీ భావిస్తోంది. దానికి అనుగుణంగానే సీఎస్కే అడుగులు ఉన్నాయని రెండు మ్యాచ్‌లు కనిపించాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News