Ind Vs Ban Odi Series: రోహిత్ శర్మకు క్లాస్ పీకిన సునీల్ గవాస్కర్.. భారత్ ఓటమికి కొత్త కారణం

Sunil Gavaskar On Team India: బంగ్లాదేశ్‌తో భారత్ ఓటమికి అందరూ కేఎల్ రాహుల్‌ను నిందిస్తుంటే.. సునీల్ గవాస్కర్ సరికొత్త కారణం చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మపై మండిపడ్డారు. భారత బౌలర్లను అభినందించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 03:55 PM IST
Ind Vs Ban Odi Series: రోహిత్ శర్మకు క్లాస్ పీకిన సునీల్ గవాస్కర్.. భారత్ ఓటమికి కొత్త కారణం

Sunil Gavaskar On Team India: మీర్పూర్‌ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన తొలివన్డేలో భారత్‌ ఓటమి పాలైంది. ఒకదశలో టీమిండియదే విజయం ఖాయమని అందరూ ఫిక్స్‌ అయిపోగా.. బంగ్లా ఆల్‌రౌండర్ మెహీది హసన్ (38) అద్భుతంగా పోరాడి బంగ్లాను గెలిపించాడు. ముస్తాఫిజూర్ రెహ్మాన్ (10)తో కలిసి చివరి వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించి.. బంగ్లాదేశ్‌కు చరిత్రలో నిలిచేపోయే విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సులువైన క్యాచ్‌ నేలపాలు చేయడంతో భారత్ ఓడిపోయిందని అందరూ నిందిస్తున్నారు. 

టీమిండియా ఓటమిపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క్లాస్ పీకారు. మరో 30 నుంచి 40 పరుగులు తక్కువ చేయడంతో ఓడిపోయామని రోహిత్ శర్మ చెప్పడంపై మండిపడ్డారు. 'భారత్ 30 నుంచి 40 పరుగులు తక్కువ చేయలేదు. 70 నుంచి 80 పరుగులు తక్కువ చేసింది. బంగ్లాదేశ్‌పై టీమిండియా కనీసం 250 పరుగులు చేసి ఉండాల్సింది.. ఒకవేళ టీమిండియా 250 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది' అని చెప్పారు. 

భారత బౌలర్ల అద్భుతంగా బౌలింగ్ చేశారని సునీల్ గవాస్కర్ అభినందించారు. బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ అక్కడే ముగిసిందని అనుకున్నానని అన్నారు. మెహదీ హసన్ మిరాజ్‌కు అదృష్టం వరించడంతో  క్యాచ్‌లు నేలపాలయ్యాయని అన్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బంగ్లాకు మర్చిపోలేని విజయాన్ని అందించాడని ప్రశంసించాడు. 
 
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి..  41.2 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (73) ఒక్కడే రాణించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడగా..  మెహదీ హసన్‌ ఒంటి చెత్తో మ్యాచ్‌ను గెలిపించి హీరోగా మారిపోయాడు. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు జట్ల మధ్య సెకెండ్ వన్డే బుధవారం జరగనుంది. 

Also Read: Old City Fake Baba: ఫేక్ బాబా ఫోన్‌లో వందలాది మంది మహిళల న్యూడ్ ఫొటోలు.. ఫిజిక్‌ను బట్టి రేటు ఫిక్స్  

Also Read: Byreddy Siddharth Reddy: బైరెడ్డి పవర్‌పుల్ స్పీచ్.. మధ్యలో అస్వస్థత.. కార్యకర్తల్లో ఆందోళన  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News