R Ashwin Eye On Legendary Anil Kumble's Rare Record in IND vs AUS 3rd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ బ్యాటర్లను స్పిన్ ఉచ్చులో పడేసిన భారత స్పిన్నర్లు ఒక్కరిని కూడా భారీ ఇన్నింగ్స్ ఆడనీయలేదు. 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. మూడో టెస్టులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా.. కనీసం మూడో టెస్టులోనైనా పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి1 నుంచి ప్రారంభం కానుంది.
మూడో టెస్టు నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఇండోర్ టెస్టులో అశ్విన్ మరో 9 వికెట్లు పడగొడితే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఇప్పటివరకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో యాష్ 103 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు. ఈ ట్రోఫీలో జంబో 111 వికెట్లు పడగొట్టాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత అశ్విన్ జోరును చూస్తుంటే.. కుంబ్లే రికార్డును ఇండోర్ టెస్టులోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది. యాష్ కేవలం టెస్టులోనే ఎక్కువగా ఆడుతున్న విషయం తెలిసిందే. రవీంద్ర జడేజాతో కలిసి జట్టుకు మంచి విజయాలు అందిసున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు 90 టెస్టులు ఆడి 463 వికెట్స్ పడగొట్టాడు. ఐదు వికెట్స్ 31సార్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగులతో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో యాష్ చెలరేగి ఐదు వికెట్లు పడగొట్టాడు. దాంతో అశ్విన్ భారత్ తరఫున సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. స్వదేశంలో 25 సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో శ్రీలంక ఆటగాళ్లు ముత్తయ్య మురళీధరన్ (45 ఐదు వికెట్లు), రంగనా హెరాత్ (26 ఐదు వికెట్లు) సాధించారు.
Also Read: Harbhaja Singh: రాహుల్ ద్రవిడ్ వద్దు.. మరో కోచ్‌ని నియమించండి: హర్భజన్ సింగ్
Also Read: Tim Southee: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టిమ్ సౌథీ.. తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా అరుదైన ఘనత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.