Imam ul Haq Run Out: 'ఓహో నో.. ఇది ఔటా?' పాకిస్థాన్‌ అమ్మాయిల వీడియో వైరల్‌

Pakistan Fans Shocked After Imam ul Haq Run Out: భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. పాకిస్థాన్‌ బ్యాటర్‌ రనౌట్‌ అయిన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. రనౌట్‌ను ఊహించని పాక్‌ అభిమానులు ఆశ్చర్యం చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 23, 2025, 07:24 PM IST
Imam ul Haq Run Out: 'ఓహో నో.. ఇది ఔటా?' పాకిస్థాన్‌ అమ్మాయిల వీడియో వైరల్‌

  Viral Video: ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యంత ఉత్కంఠ కలిగించిన భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ జట్టుకు ఇమామ్‌ ఉల్‌ హక్‌ రనౌట్‌ సంచలనం రేపింది. అక్షర్‌ పటేల్ అత్యంత వేగంగా బంతిని వికెట్లపై విసరడంతో ఇమామ్‌ పెవిలియన్ వీడాడు. అతడి రనౌట్‌తో పాకిస్థాన్‌ అభిమానులు నివ్వెరపోయారు. 'ఓహో నో', 'ఇది ఔటా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: Champions Trophy 2025: ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్, విజయావకాశాలు అంచనాలు

దుబాయ్‌ వేదికగా ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ ఓడి బౌలింగ్‌కు దిగిన భారత జట్టు పాకిస్థాన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థులు తలపడగా ఈ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠగా మారింది. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎదురుచూసే ఈ మ్యాచ్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఇమామ్‌ ఉల్‌ హక్‌ రనౌట్‌ అత్యంత ఆసక్తిగా నిలిచింది. అతడి ఔట్‌ అయిన సందర్భంగా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: IND VS PAK Live Score: కట్టదిట్టంగా టీమిండియా బౌలింగ్.. పాక్ స్కోరు ఎంతంటే..?

హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఇమామ్‌ ఉల్‌ హక్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. పాండ్యా వేసిన మొదటి ఓవర్‌లో ఇమామ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. బంతిని ఎదుర్కొన్నాడు. బంతిని ఎదుర్కొన్న ఇమామ్‌ ఉల్‌ హక్‌ రన్‌ కోసం పరుగెత్తాడు. అయితే బౌలర్‌ను దాటి అక్షర్‌ పటేల్‌ వైపు బంతి వెళ్లింది. అత్యంత వేగంగా స్పందించిన అక్షర్‌ వెంటనే బంతిని అందుకున్నాడు. అదే వేగంతో నేరుగా వికెట్లకు విసిరాడు. అంతే వికెట్లు పడిపోయాయి. ఆలోపు బ్యాటర్‌ ఇమామ్‌ రాకపోవడంతో రనౌట్‌ అయ్యాడు. ఇది చూసిన ప్రేక్షకులు విస్తుపోయారు. భారత అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం.. కేరింతలు రాగా.. పాకిస్థాన్‌ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

స్టాండ్స్‌లో ఉన్న పాకిస్థాన్‌ అమ్మాయిలు రనౌట్‌ను చూసి విస్తుపోయారు. రనౌట్‌ నిజమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఔనా నిజమా?', 'ఓహో నో' అంటూ పాకిస్థాన్‌ అమ్మాయిలు నోరెళ్లబెట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మాయిలు స్టాండ్స్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అమ్మాయిలు అందంగా కనిపించడంతో వాటిపైన కూడా నెటిజన్లు వారిని పొగిడేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News