Mushfiqur Rahim vs Nasum Ahmed: ఫీల్డర్‌ని కొట్టబోయిన వికెట్ కీపర్.. వీడియో వైరల్

Mushfiqur Rahim loses cool during Bangabandhu T20 Cup: క్రికెట్ అనేది జెంటిల్‌మేన్స్ గేమ్ అని అంటుంటారు. కానీ ఆ జెంటిల్‌మేన్ గేమ్‌లోనూ అప్పుడప్పుడు ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడం మనం చూస్తుంటాం.

Last Updated : Dec 15, 2020, 11:02 AM IST
Mushfiqur Rahim vs Nasum Ahmed: ఫీల్డర్‌ని కొట్టబోయిన వికెట్ కీపర్.. వీడియో వైరల్

Mushfiqur Rahim loses cool during Bangabandhu T20 Cup: క్రికెట్ అనేది జెంటిల్‌మేన్స్ గేమ్ అని అంటుంటారు. కానీ ఆ జెంటిల్‌మేన్ గేమ్‌లోనూ అప్పుడప్పుడు ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడం మనం చూస్తుంటాం. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఎంతో అనుభవం సంపాదించిన కొంతమంది క్రికెటర్స్ తమ కోపాన్ని సైతం కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతారు. కానీ ఇంకొంత మంది ఆటగాళ్లు మాత్రం తమ ఎమోషన్స్‌ని అదుపులో పెట్టుకోలేక తోటి ఆటగాళ్లపై చిరాకు పడుతుంటారు. తాజాగా బంగ్లాదేశ్‌కి చెందిన సీనియర్ క్రికెటర్ ముష్ ఫిఖర్ రహీం కూడా ఈ రెండో తరహాకు చెందిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయారు.                                                                                                                    
బంగబంధు టీ20 కప్‌లో భాగంగా బెక్సింకో ఢాకా vs ఫార్చూన్ బరిషల్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముష్‌ఫిఖర్ రహీం జట్టు 149 పరుగులు చేయగా.. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బరిషల్ జట్టు దాదాపు విజయానికి చేరువలో ఉందనగా చోటుచేసుకున్న ఘటన ఇది. తమ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఆతిఫ్ హుస్సేన్ 17వ ఓవర్ చివరి బంతికి షాట్‌కి ప్రయత్నించబోగా.. అది గాల్లోకి లేచింది. జోష్ మీదున్న ఆతిఫ్‌ని ఔట్ చేసేందుకు ఇదే రైట్ టైమ్ అని భావించిన  ముష్‌ఫిఖర్ రహీం ( Mushfiqur Rahim ) ఆ బంతిని క్యాచ్ పట్టుకునేందుకు వెళ్లగా.. అదే క్యాచ్ కోసం నాసుం అహ్మెద్ కూడా ( Nasum Ahmed ) పోటీపడ్డాడు. ఒకనొక దశలో ఒకరినొకరు ఢీకొనే పరిస్థితి నుంచి తప్పించుకుని క్యాచ్ పట్టుకున్న ముష్‌ఫిఖర్ రహీం... అనంతరం తనకు పోటీకి వచ్చిన అహ్మెద్‌పై గుడ్లురిమి చూడటంతో పాటు ఒక్క పంచ్ ఇచ్చానంటే అన్నట్టు సైగ కూడా చేశాడు. 

 

అహ్మెద్‌పై రహీం ఆగ్రహం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహీంని కూల్ చేస్తూ అహ్మెద్‌ని లైట్ తీసుకోవాల్సిందిగా చెబుతూ అతడి టీమ్‌మేట్స్ వారిని శాంతపరిచారు. ఆ తర్వాత ఢాకా జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x