Liquor consumption: దక్షిణాదిలోనే తాగుబోతులు ఎక్కువ.. ఏ రాష్ట్రం టాప్ ప్లేస్ అంటే.. !

Liquor consumption: సౌత్ లోనే తాగుబోతులు ఎక్కువ. ఎక్కువ మంది తాగేవాళ్లు మన దక్షిణాదిలోనే ఎక్కువున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో తాగేవారి సంఖ్య తగ్గింది. కానీ వీర లెవల్లో తాగేవాళ్ల సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. 

1 /5

Liquor consumption: భారత దేశంలో అందులో దక్షిణాది రాష్ట్రాల వాళ్లే ఎక్కువ తాగుతున్నారనే విషయం తాజాగా కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. లిక్కర్ వాడకంలో సౌత్ టాప్ లో ఉంది. అందులో తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.

2 /5

అవును తెలంగాణ ప్రజల్లో ఎక్కువ మంది లిక్కర్ తాగుతున్నట్టు కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి. అదే టైమ్ లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం సేవించే వారి సంఖ్య గతంలో కంటే గణనీయంగా తగ్గింది. 

3 /5

దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది మద్యం సేవిస్తున్నట్టు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు.

4 /5

2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం ఏపీలో 34.9 శాతం మంది, తెలంగాణలో 53.8 శాతం మంది పురుషులు మద్యం తాగేవారున్నరని తెలిపారు.

5 /5

2019-21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో 50 శాతం.. ఆంధ్ర ప్రదేశ్ లో  ఈ సంఖ్య 31.2 శాతానికి తగ్గిందని తన నివేదికలో తెలిపింది.  దేశ వ్యాప్తంగానూ మద్యం సేవించే మగవారి జాతీ సగటు సంఖ్య 29.2 శాతం నుంచి 22.4 శాతానికి తగ్గిందన్నారు. ఇదో మంచి శుభ పరిణామన్నారు.