Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై జట్టు.. టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు..

T20 Cricket: ఐపీఎల్ మాత్రమే కాదు టీ20 ఫార్మాట్ లోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును ముంబై ఇండియన్స్ జట్టు నెలకొల్పింది. టీ20ల్లో 150 150 మ్యాచ్‌లు గెలిసిన తొలి జ‌ట్టుగా రికార్డు క్రియేట్ సృష్టించింది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 8, 2024, 02:05 PM IST
Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై జట్టు.. టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు..

Mumbai Indians make history: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఆదివారం వాంఖడే స్టేడియంలో చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 150 మ్యాచ్‌లు గెలిసిన తొలి జ‌ట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. టీ20 ఫార్మాట్‌లో ఏ టీమ్ కూడా ఇన్ని మ్యాచ్‌లు గెలవలేదు. ఆదివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై గెలుపొందడం ద్వార ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ టీమ్ 273 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 150 మ్యాచ్‌లు నెగ్గి, 117 మ్యాచుల్లో ఓడిపోయింది. రెండు మ్యాచుల్లో ఫలితాలు రాలేదు. ఇక సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లిన మ్యాచుల్లో ముంబై రెండింటిలో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. 

రెండో స్థానంలో చెన్నై..
ఇక ఈ జాబితాలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు రెండో స్థానంలో ఉంది. సీఎస్కే ఇప్పటి వరకు 253 మ్యాచులు ఆడగా..148 మ్యాచుల్లో గెలిచి..101 మ్యాచుల్లో ఓడింది. రెండు మ్యాచుల్లో ఫలితంరాలేదు. ఒక మ్యాచ్ టై కాగా.. రెండు సూపర్ ఓవర్ మ్యాచుల్లో చెన్నై ఓడిపోయింది. ఐపీఎల్ తోపాటు టీ20 క్రికెట్ ను కూడా పరిశీలిస్తే.. ముంబై, చెన్నై జట్ల తర్వాత మూడో స్థానంలో టీమిండియా ఉంది. భారత జట్టు 219 మ్యాచ్‌లలో 140 విజయాలు సాధించింది. 68 మ్యాచుల్లో ఓడిపోగా.. ఆరు మ్యాచుల్లో ఫలితంరాలేదు. ఒక మ్యాచ్ టై కాగా..నాలుగు సూపర్ ఓవర్ మ్యాచుల్లో విజయం సాధించింది. 

Also Read: MI vs DC Match: సమిష్టిగా రాణించిన హార్దిక్ సేన.. ఎట్టకేలకు ముంబైను వరించిన విజయం..

ముంబై మరో ఘనత...
ముంబై మరో రికార్డును క్రియేట్ చేసింది. ఒకే స్టేడియంలో 50 విజయాలు సాధించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. ఆ జట్టు వాంఖడే స్టేడియంలో 50 మ్యాచులు గెలిచింది. రెండో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఉంది. కేకేఆర్ తన హోం గ్రౌండైన ఈడెన్ గార్డెన్స్‌లో 48 మ్యాచ్‌లు గెలిచింది. చెపాక్ స్టేడియంలో 47 విజయాలు సాధించి చెన్నై మూడో స్థానంలో నిలిచింది. 

Also Read: MI vs DC IPL 2024 Highlights: జస్ప్రీత్ బుమ్రా మైంబ్ బ్లోయింగ్ యార్కర్.. పృథ్వీ షా దిమ్మతిరిగింది.. క్లీన్‌బౌల్డ్ వీడియో చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News