Mumbai Indians Vs Lucknow Super Giants Indians Playing XI Dream11 Team Tips: ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ప్లే ఆఫ్స్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అడుగుపెట్టడంతో మిగిలిన ఒక స్థానం కోసం పోటీ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది. లక్నో జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా.. ముంబైను 310 పరుగుల తేడాతో ఓడించడంతోపాటు
చెన్నైపై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం కాబట్టి.. లక్నో కూడా రేసు నుంచి తప్పుకుంది. నేడు ముంబై ఇండియన్స్‌తో లక్నో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ నామమాత్రమే. గెలిచిన జట్టు విజయోత్సాహంతో టోర్నీని ముగిస్తుంది. వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also Read: Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన పోస్ట్.. అర్ధం అదేనా..
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. ముంబై, లక్నో ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్‌లో గెలుపొందగా.. లక్నో సూపర్ జెయింట్స్ మూడింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి. పిచ్ విషయానికి వస్తే.. ముంబైలోని వాంఖడే స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. మంచి బౌన్స్ క్యారీతో ఫ్లాట్‌గా ఉంటుంది. దీంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. అయితే ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. గూగుల్ విన్ ప్రాబబిలిటీ ప్రకారం.. ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం 56 శాతం ఉంది. లక్నోకు 46 శాతం విజయ అవకాశాలు ఉన్నాయి.
తుది జట్లు ఇలా.. (అంచనా)
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్.
MI Vs LSG Dream11 Prediction:
==> వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్
==> బ్యాటర్లు: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ
==> ఆల్ రౌండర్లు: మార్కస్ స్టోయినిస్
==> బౌలర్లు: పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నవీన్-ఉల్-హక్, అర్షద్ ఖాన్
Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter