KL Rahul Duck Outs: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతున్నాడు. తద్వారా వరుస మ్యాచ్‌లలో డకౌట్ అయిన అయిదవ భారత క్రికెటర్‌గా నిలిచాడు రాహుల్. మరోవైపు ఓవరాల్‌గా చూసుకుంటే 0, 1, 0, 0 మ్యాచ్ స్కోర్లతో రాహుల్ ఫామ్ కోల్పోతున్నాడు.
ఓపెనింగ్ సరిగా లేనందున భారత్ ఓటముల బాట పట్టిందని విమర్శలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్ ఇకనైనా ఆటతీరు మార్చుకోవాలని లేని పక్షంలో జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఫామ్‌లోకొచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని వెనకొసుకొస్తున్నాడు. రాహుల్ మ్యాచ్ విన్నర్ అని, అతడు ఛాంపియన్ అని మద్దతు తెలిపాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్‌కు ప్రాక్టీస్ సరిగా లభించలేదని, దానివల్ల అతడు త్వరగా వికెట్ కోల్పోతున్నాడని కోహ్లీ(Virat Kohli) పేర్కొన్నాడు.
Also Read: ICC Bans Cricketers: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ
కొన్ని మ్యాచ్‌లలో వరుసగా విఫలైన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో, మూడో టీ20లలో సత్తా చాటాడు. వరుస అర్ధ శతకాలతో చెలరేగుతున్నాడు. తొలి టీ20లో విఫలమైన కోహ్లీ 73, 77 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కానీ జట్టు ఆటగాళ్లు సమష్టిగా రాణించకపోవడంతో టీమిండియా ఓటములు సర్వ సాధారంగా మారుతున్నాయి. భారీ స్కోర్లు సాధిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు అడ్డుకట్ట వేయవచ్చునని అభిప్రాయపడ్డాడు.
Also Read: Jasprit Bumrah Wedding Photos: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
కొన్ని రోజుల కిందటి వరకు తాను కూడా ఫామ్‌లో లేనని కోహ్లీ గుర్తు చేశాడు. టీమిండియా (Team India) టీ20ల్లో రాణించాలంటే ఫామ్ అనేది అంత కీలకం కాదని, కేవలం ఒక్క ఓవర్‌లో కేఎల్ రాహుల్(KL Rahul) ఫామ్‌లోకి రావచ్చునని పేర్కొన్నాడు. కానీ జట్టుకు విజయాన్ని అందించని భారీ ఇన్నింగ్స్‌లైనా వృథాయేనని, బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్‌లోనూ రాణిస్తే జట్టుకు విజయాలు సాధ్యమని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Also Read: IPL 2021 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్స్ MS Dhoni ప్రాక్టీస్ షురూ, టైటిల్ లక్ష్యంగా సీఎస్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook