LSG Player Marcus Stoinis Hugs Physio after Finger Injury vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం రాత్రి మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగుల రికార్డు స్కోరు చేసింది. విదేశీ హిట్టర్లు కైల్ మేయర్స్ (54; 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్కస్ స్టొయినిస్ (72; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), నికోలస్ పూరన్ (45; 19 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్).. యువ ఆటగాడు ఆయుష్ బదోని (43; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగుల వరద పారించారు. ఛేదనలో పంజాబ్ మరో బంతి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయింది. యువ ప్లేయర్ అథర్వ తైడే (66; 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ వీరవిహారం చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించాడు. బౌలర్ ఎవరైనా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. కైల్ మేయర్స్ ఇచ్చిన ఆరంభాన్ని స్టొయినిస్ ముందుకు తీసుకుళ్లాడు. దాంతో లక్నో భారీ స్కోర్ చేసేందుకు బాటలు వేశాడు. అయితే స్టొయినిస్ ఇన్ని పరుగులు చేసేవాడు కాదు. స్టొయినిస్ భారీ షాట్ ఆడగా.. లియామ్ లివింగ్ స్టోన్ క్యాచ్ పట్టి బౌండరీని తొక్కేశాడు. లైఫ్ దొరకడంతో స్టొయినిస్ మరింత రెచ్చిపోయి ఆడాడు.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మార్కస్ స్టొయినిస్ గాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో వేసిన స్టొయినిస్ ఆదిలోనే కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఔట్ చేశాడు. ఆపై మూడో ఓవర్ వేసిన స్టొయినిస్ బౌలింగ్‌లో అథర్వ తైదే స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. బంతిని ఆపే క్రమంలో ఎడమ చూపుడు వేలికి గాయమైంది. దీంతో మైదానంలో నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే లక్నో ఫిజియో చికిత్స చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో స్టొయినిస్ మైదానం వీడాడు. ఆ వెంటనే స్కానింగ్ కోసం లక్నో బృందం పంపింది.
తాను స్కానింగ్ వెళ్లాలని మార్కస్ స్టొయినిస్ తెలిపాడు. 'ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది. స్కానింగ్‌కు వెళ్లాను. రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాము. అంతా బాగానే ఉంటుందని ఆశిస్తున్నా. వచ్చే మ్యాచులో ఆడతాననే నమ్మకం ఉంది' అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో స్టొయినిస్ పేర్కొన్నాడు. అయితే స్టొయినిస్ గాయం తీవ్రమైనదిగా అని సమాచారం. వైద్యులు రెస్ట్ తీసుకోవాలని చెబితే తర్వాతి మ్యాచ్‌లకు దూరం కాక తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.