CSK vs MI IPL 2023 49th Match Live Score Updates: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ టాప్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మరికాసేపట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికంగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పు చేసింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై ఎలాంటి మార్పులు చేయలేదు.
టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో ఐదింట్లో నెగ్గి ఆరో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా రెండు పరాజయాలు నమోదు చేసిన చెన్నై పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు భారీ లక్ష్యాలను ఛేదిస్తూ ముంబై ముందుకు సాగుతోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. చెన్నై, ముంబై జట్లలో ఏది గెలిచినా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది.
చెన్నై అభిమానులు ‘చిన్న తలా’ అంటూ ముద్దుగా పిలుచుకునే టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా మైదానానికి వచ్చాడు. తన అభిమాన జట్టు చెన్నైను ఉత్సాహపరిచేందుకు యెల్లో జెర్సీ వేసుకున్నాడు. రైనా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనాటి విషయాలను వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై తన ట్విటర్‌లో ఓ పోస్టు చేసింది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, మతీష పతిరణ, తుషార్ దేశ్‌పాండే.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, సూర్యకుమార్ యాదవ్, కెమారూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, ఆర్షద్ ఖాన్.
డ్రీమ్ 11 టీమ్:
కీపర్ - డెవాన్ కాన్వే, ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్ - రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్)
ఆల్ రౌండర్లు - రవీంద్ర జడేజా (కెప్టెన్), మొయిన్ అలీ, కామెరాన్ గ్రీన్
బౌలర్లు - పీయూష్ చావ్లా, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, జోఫ్రా ఆర్చర్
Also Read: DC vs RCB: సెంచరీ చేసి సౌరవ్ గంగూలీకి అంకితం ఇవ్వు.. విరాట్ కోహ్లీకి శ్రీశాంత్ సూచన!
Also Read: Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.