IND vs SA Highlights: రెండో టెస్ట్‌లో టీమిండియాదే హవా.. చాప చుట్టేసిన సౌతాఫ్రికా

India vs South Africa Full Highlights: సఫారీ గడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. రెండో టెస్టులో 7 వికెట్లతో విక్టరీ సాధించింది. బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంతో ఈ మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 4, 2024, 09:11 PM IST
IND vs SA Highlights: రెండో టెస్ట్‌లో టీమిండియాదే హవా.. చాప చుట్టేసిన సౌతాఫ్రికా

India vs South Africa Full Highlights: తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్టులో రెచ్చిపోయింది. సౌతాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు దక్షిణాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయింది. మార్క్రామ్ (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి సహాకారం కరువైంది. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బుమ్రా, సిరాజ్‌కు దక్కగా.. మ్యాన్ ఆఫ్‌ ద సిరీస్‌కు డీన్ ఎల్గర్ ఎంపికయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో మొత్తం బౌలర్లదే ఆధిపత్యం. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల దెబ్బకు 55 పరుగులకే కుప్పకూలింది.  సిరాజ్ 6 వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 98 రన్స్ ఆధిక్యం లభించింది. రబాడ, ఎంగిడి, బర్గర్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. 

రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో దుమ్ములేపాడు. ఆరు వికెట్లతో సఫారీల భరతం పట్టగా.. ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. ఐడెన్ మార్క్రామ్ 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. అయితే మరే ఇతర బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తీసేయగా.. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 12 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రెండో రోజు ముగిసేలోపు విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (28) దూకుడుగా ఆడాడు. రోహిత్ శర్మ (17 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (12) తలో చేయి వేశారు. శ్రేయాస్ అయ్యర్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతాలు చేసి మొత్తం 20 వికెట్లు పడగొట్టడం విశేషం. వికెట్లన్నీ పేసర్లకే దక్కాయి.

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: PM Modi: లక్షదీవుల్లో ప్రధాని మోదీ స్నార్కెలింగ్‌ సాహసం.. నెట్టింట పిక్స్ వైరల్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News