AUS vs IND: ఆస్ట్రేలియా ఓటమికి అసలు కారణం అదే.. వీరేందర్ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virender Sehwag interesting comments on Australia after defeat Nagpur Test. పిచ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఆసీస్ ఓడిపోయినట్లు కనిపించిందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అన్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 12, 2023, 01:50 PM IST
  • ఆస్ట్రేలియా ఓటమికి అసలు కారణం అదే
  • వీరేందర్ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • టెస్టు సిరీస్‌లో భారత్ 1-0తో ముందడుగు
AUS vs IND: ఆస్ట్రేలియా ఓటమికి అసలు కారణం అదే.. వీరేందర్ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virender Sehwag interesting comments on Australia after defeat Nagpur Test: బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023)లో భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాగ్‌పుర్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 400 రన్స్ చేసింది. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన ఆసీస్ 91కే ఆలౌట్‌ అయింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ముందడుగు వేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజాకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'అవార్డు దక్కింది.

నాగ్‌పుర్‌ టెస్టులో పిచ్‌ని (Nagpur Pitch) స్పిన్‌కు అనుకూలంగా  తయారు చేసుకున్నారని మ్యాచ్‌ జరగడానికి ముందే ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు భారత గడ్డపై ఆడిన కొంతమంది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియాలో ఇదే అభిప్రాయం తెలిపారు. దాంతో టెస్ట్ మొదలవడానికి ముందే మ్యాటర్ మొత్తం పిచ్‌పైనే తిరిగింది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా స్పిన్ పిచ్ అని మ్యాచ్‌కు ముందు అన్నాడు. అయితే పిచ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఆసీస్ ఓడిపోయినట్లు కనిపించిందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అన్నాడు. 

'భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. పిచ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఈ టెస్టును ప్రారంభించకముందే ఓడిపోయినట్లు కనిపించింది. నాగ్‌పుర్‌ పిచ్‌పై పరుగులు చేయడం కష్టమని ఆస్ట్రేలియా ప్లేయర్స్ భావించారు. అయితే ఇదే పిచ్‌లో భారత్ బాగా బ్యాటింగ్ చేసి 400 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ మనస్సుల్లో భిన్నమైన ఆలోచన ఉందనడానికి ఇది ఓ ఉదాహరణ. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, మొహ్మద్ షమీ, రోహిత్ శర్మ స్టార్ బాగా ఆడారు. వెల్ డన్‌ బాయ్స్‌’ అని డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

నాగ్‌పుర్‌ పిచ్‌ గురించి ఆస్టేలియా భయపడటానికి ఆసీస్ మీడియానే కారణమని భారత మాజీ దిగ్గజం సునీల్ గాస్కర్ అన్నారు. 'ఆస్ట్రేలియా జట్టు వారి సొంత మీడియా ద్వారానే చాలా భయపడింది. పిచ్‌ గురించి భారత్ మీడియా కానీ, మాజీలు కానీ ఎవరూ మాట్లాడలేదు. ఆసీస్ మీడియానే పిచ్‌పై అనేక స్టోరీస్ రాసింది' అని లిటిల్ మాస్టర్ సన్నీ చెప్పారు. బ్యాటర్లు తడబడిన నాగ్‌పుర్‌ పిచ్‌పై భారత బౌలర్లు బాగా ఆడారని పలువురు మాజీలు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. 

Also Read: Honda City Cars: 3 లక్షలకే హోండా సిటీ కారు.. గంటలో నంబర్ ప్లేట్‌తో సహా ఇంటికి తీసుకెళ్లిపోవుచ్చు!  

Also Read: Turkey-Syria Earthquake: 30 వేలకు చేరువలో భూకంప మృతుల సంఖ్య..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News