World Cup 2023: ప్రపంచకప్ 2023 లీగ్ జర్నీ ఇవాళ్టితో ముగుస్తోంది. చిట్ట చివరి లీగ్ మ్యాచ్ ఇవాళ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియా చివరి మ్యాచ్ గెలుపుతో క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మరో రెండు పాయింట్లు పెంచుకునేందుకు యోచిస్తోంది.
ప్రపంచకప్ 2023లో ఇవాళ జరిగే చివరి లీగ్ మ్యాచ్ కాకుండా ఇక మూడే మ్యాచ్‌లు మిగిలాయి. రెండు సెమీపైనల్ మ్యాచ్‌లు , ఒక ఫైనల్. నవంబర్ 15న న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్‌కు ముందు ఇండియా ఇవాళ తన చివరి మ్యాచ్ ఆడనుంది. మొత్తం టోర్నీలోనే ఇవాళ చివరి లీగ్ మ్యాచ్. ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్‌కు అంత ప్రాముఖ్యత లేకపోయినా చిట్ట చివరి మ్యాచ్ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలనేది ఇండియా ఆలోచన కాగా ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు పైకి ఎగబాకాలనేది నెదర్లాండ్స్ ప్రయత్నం కావచ్చు. గెలుపోటముల పరంగా అంతగా ప్రాముఖ్యత లేకపోయినా పరాజయం లేకుండా సాగుతున్న ఇండియా జైత్రయాత్రను కొనసాగించాలనేది రోహిత్ సేన లక్ష్యంగా ఉంది. మరి జట్టులో ఏమైనా మార్పులు చేస్తాడా లేదా అనేది ఇంకా తెలియదు.
ప్లేయింగ్ 11లో మార్పులతో రోహిత్ సేన సీనియర్లకు విశ్రాంతి ఇవ్వవచ్చు. లేదా ఇదే జట్టుతో ఆడవచ్చు. ఇక విరాట్ కోహ్లీ ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డు సమం చేశాడు. ఇవాళ సెంచరీ సాధిస్తే ఆ రికార్డును దాటినట్టవుతుంది. కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో అత్యధికంగా 543 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో తొలిసారిగా కోహ్లీ 500 పరుగుల మార్క్ దాటాడు. 2011లో 282, 2015లో 305, 2019లో 443 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో అంతకంటే అద్భుతంగా రాణిస్తూ 500 పరుగులు దాటేశాడు.
ఇండియా ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook