Champions Trophy 2025: ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్, విజయావకాశాలు అంచనాలు

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ వేదిక కానుంది. ఏడేళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకునేందుకు టీమ్ ఇండియా కసిగా ఉంటే టోర్నీ నిష్క్రమణ ముప్పు నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. రెండు జట్లకు ఉన్న విజయావకాశాల గురించి పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2025, 01:30 PM IST
Champions Trophy 2025: ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్, విజయావకాశాలు అంచనాలు

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డ్రీమ్ 11 ప్రెడిక్షన్ ఎలా ఉందో చూద్దాం. ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా చూస్తున్న ఈ మ్యాచ్ ఫాంటసీ టిప్స్, ప్రేయింగ్ 11 అంచనాలు, గెలుపోటముల విశ్లేషణ గురించి చెక్ చేద్దాం.

ప్రత్యర్థి వైరి దేశాలైన ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఆసక్తి. ఉత్కంఠత ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే మొత్తం క్రికెట్ ప్రపంచానికే ఉత్కంఠగా ఉంటుంది. రెండు జట్ల మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బెట్టింగులు కూడా అధికమైనట్టు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం తరువాత ఉత్సాహంగా ఉంది. శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీ, మొహమ్మద్ షమి 5 వికెట్ హాల్‌తో బంగ్లాదేశ్ చిత్తయింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై గెలిస్తే టీమ్ ఇండియాకు సెమీఫైనల్ అవకాశాలు పెరుగుతాయి. సరిగ్గా ఏడేళ్ల క్రితం 2017లో ఇదే ట్రోఫీ టైటిల్ పోరులో టీమ్ ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఇప్పుడు ఇండియా ఏడేళ్ల క్రితం నాటికి పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంది. 

మరోవైపు మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓటమితో పాకిస్తాన్‌కు ఇది అత్యంత కీలకమైపోయింది. చావో రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్‌గా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించాలంటే బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ తమదైన ఆటను ప్రదర్శించాల్సి వస్తుంది. 

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమీ

పాకిస్తాన్ ప్లేయింగ్ 11

బాబర్ ఆజమ్, సాద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, కామ్రాన్ గులామ్, తయ్యబ్ తాహిర్, ఖుష్ దిల్ షాహ్, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

దుబాయ్ వేదికగా ఇవాళ అంటే ఫిబ్రవరి 23 మద్యాహ్నం 2.30 గంటలకు ఇండియా పాకస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

Also read: LIC Pension Scheme: ఎల్ఐసీలో ఈ స్కీమ్ తీసుకుంటే మీకు, మీ భాగస్వామికి జీవితాంతం పెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News