CSK OUT IN IPL: ముంబై బాటలోనే చెన్నై.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్..

IPL 2020: ఐపీఎల్ లో మరో సంచలనం నమోదైంది. ముంబై ఇండియన్స్ బాటలోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి అవుటైంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఘోరంగా విఫలమైంది ధోనీ సేన.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 08:02 AM IST
  • ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి చెన్నై అవుట్
  • తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసిన చెన్నై
  • 97 పరుగులకే చాప చుట్టేసిన ధోనీసేన
CSK OUT IN IPL: ముంబై బాటలోనే చెన్నై.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్..

IPL 2020: ఐపీఎల్ లో మరో సంచలనం నమోదైంది. ముంబై ఇండియన్స్ బాటలోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి అవుటైంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఘోరంగా విఫలమైంది ధోనీ సేన. ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తై లీగ్ దశలోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నై పై ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆప్ రేస్ నుంచి అవుటైన ముంబై ఇండియన్స్.. తాజా విజయంతో తమతో పాటు చెన్నైని ఇంటిదారి పట్టించింది.

గురువారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. తొలి ఓవర్ నుంచి వికెట్లు కోల్పోయిన ధోనీసేన.. 16 ఓవర్లలో కేవలం 97 పరుగులకే చాప చుట్టేసింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోర్. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ ధోనీ ఒక్కడే రాణించాడు. టెయిల్ ఎండర్ల  అండతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నించిన ధోని.. 36 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో డానియెల్ సామ్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. కార్తికేయ, మెరిడిత్ కు తలా రెండు వికెట్లు లభించాయి.

98 పరుగుల స్వల్ప టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన ముంబై కూడా తడబడింది. తొలి రెండు వికెట్లను వెంటనే కోల్పోయింది. చెన్నై పేసర్ ముకేష్ చౌధరి విజృంభించాడు. తొలి ఓవర్ లోనే ఇషాన్ కిషన్, సామ్స్ ను అవుట్ చేశాడు. తర్వాత స్టబ్స్ ను పెవిలియన్ పంపించాడు. మరో ఎండ్ లో సిమర్జిత్ సింగ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 16 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేశాడు. దీంతో 33 పరుగులకే ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ మరోసారి ముంబైని ఆదుకున్నాడు. హృతిక్ షోకీన్ అతనికి అండగా నిలిచాడు. వీళ్లిద్దరూ నిలకడగా ఆడుతూ ముంబై స్కోర్ ను ముందుకు తీసుకెళ్లారు. ఐదో వికెట్ కు 48 రన్స్ జోడించారు. విక్టరీకి 17 పరుగులు కావాల్సిన సమయంలో హృతిక్ అవుట్ కావడంతో మ్యాచ్ మళ్లీ ఆసక్తిగా మారింది. అయితే టిమ్ డేవిడ్ రెండు సిక్సర్లు బాదడంతో ముంబై ఈజీగానే టార్గెట్ రీచైంది. తిలక్ వర్మ 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి చెన్నైని దారుణంగా దెబ్బతీసిన పేసర్ సామ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

READ ALSO: Teenmar Mallanna political Party: టీఆర్‌ఎస్‌ నిట్టనిలువుగా చీలే రోజు త్వరలోనే ఉందన్న తీన్మార్‌ మల్లన్న

READ ALSO: Big Debate With Bharath: పీకే సర్వే రిపోర్ట్‌ లీక్‌ చేసిన తీన్మార్‌ మల్లన్న.. టీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News