Mars-Venus-Mercury Conjunction: ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. అంతేకాకుండా కొన్ని సమయాల్లో గ్రహాలు తిరోగమన దశలో కదులుతూ ఉంటాయి. మరికొన్ని సమయాల్లో ఒకే రాశిలో పలు గ్రహాలు కలుస్తాయి. దీని కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అయితే ఈ నెలలో 50 సంవత్సరాల తర్వాత సింహరాశిలో అంగారకుడు, శుక్రుడు, బుధుడు కలవబోతున్నాడు. దీంతో అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింది మూడు రాశులవారిపై నేరుగా ఈ గ్రహాల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఈ రాశులవారు మిశ్రమ ప్రయోజనాలు పొందుతారు.
ఈ రాశులవారిపై ప్రభావం:
సింహ రాశి:
సింహ రాశిలో కుజుడు, శుక్రుడు, బుధుడు కలయిక కారణంగా సింహ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇదే క్రమంలో త్రిగ్రహ యోగం ఏర్పడటం కారణంగా వైవాహిక జీవితంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. మీ జీవిత భాగస్వామితో ప్రేమ జీవితాన్ని గడపడానికి కూడా ఇష్టపడతారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఒత్తిడి కూడా సులభంగా తగ్గుతుంది. ఇక వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ క్రమంలో ప్రారంభించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన భారీ లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాక్తిగత జీవితం కూడా చాలా ఆనందంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
తుల రాశి:
మూడు గ్రహాల కలయిక కారణంగా తుల రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి. ఎలాంటి పనులు ప్రారంభించిన ఇది సరైన సమయంగా భావించవచ్చు. వ్యాపారాలు చేసేవారికి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కూడా సులభంగా లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎప్పటి నుంచో అనారోగ్య, ఆర్థిక సమస్యలో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
సింహరాశిలో మూడు గ్రహాల కలయిక కారణంగా కుంభ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్నవారికి జీవితంలో ఎప్పుడు చూడలేని లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రేమ జీవితం అనుభవిస్తున్నవారికి ఈ గ్రహాలు కలయిక ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు కష్టపడి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి