Budha Surya Gochar in Makar 2023 Budhaditya Yog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు రెండు రోజుల కిందట అంటే జనవరి 14న మకర రాశిలోకి ప్రవేశించాడు. దీనినే మకర సంక్రాంతి అని కూడా అంటారు. అయితే ఫిబ్రవరి 7న గ్రహాల యువరాజు బుధుడు కూడా అదే రాశిలో ప్రవేశించనున్నాడు. వీరిద్దరూ మకరరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మకర సంక్రాంతి ఈ నాలుగు రాశులకు అదృష్టం
మేషరాశి(Aries): బుధ సంచారం వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగం మేషరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు పని చేసే చోట గౌరవం పెరుగుతుంది. జాబ్ లో ప్రమోషన్ లభిస్తుంది. బిజినెస్ లో భారీగా లాభాలను గడిస్తారు. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి.
తుల (Libra): మకరరాశిలో బుధగ్రహ సంచారం తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కన్య (Virgo): బుధుడు సంచారం వల్ల ఏర్పడిన బుధాదిత్య రాజయోగం కన్యారాశి వారికి బంపర్ ప్రయోజనాలను ఇస్తుంది. సంపద పెరుగుతుంది. వృత్తి-వ్యాపారాలలో లాభం ఉంటుంది. ప్రేమ వివాహాలకు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. శుభవార్త కూడా వింటారు.
మకరం (Capricorn): మకరరాశిలోనే సూర్యుడు, బుధుడు కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం మకర రాశి వారికి కొన్ని శుభవార్తలను అందజేస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు రెట్టింపు అవుతుంది. ధనం పొందేందుకు కొత్త మార్గాలు అవలంబిస్తారు. వివాహం కుదిరే అవకాశం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read: Mangal Margi 2023: అంగారకుడి గమనంలో పెను మార్పు.. ఇక వీరికి లక్కే లక్కు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook