Shukra Uday: వృశ్చికరాశిలో శుక్రుడి ఉదయం... ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Shukra Uday: శుక్రుడు నిన్న వృశ్చికరాశిలో ఉదయించాడు. ఇది మూడు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 08:57 AM IST
  • అక్టోబరు 2న అస్తమించిన శుక్రుడు
  • 50 రోజుల తర్వాత ఉదయించనున్న శుక్రుడు
  • ఈ 3 రాశులకు డబ్బే డబ్బు
Shukra Uday: వృశ్చికరాశిలో శుక్రుడి ఉదయం... ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Shukra Uday: గత నెల 2వ తేదీన శుక్రుడు అస్తమించాడు. నిన్న అంటే నవంబరు 20న శుక్రుడు ఉదయించాడు. ఇది శుభకార్యాలకు ఎంతో ముఖ్యమైనది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు (Venus Planet) 50 రోజుల తర్వాత ఉదయించాడు. ఇది 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. దీంతో మీ జీవితంలో సంపద, సుఖం మరియు ప్రేమ పెరుగుతుంది. అంతేకాకుండా వీరు కెరీర్ మరియు ఆర్థిక రంగంలో చాలా పురోగతిని సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్రుడు ఉదయం ఈరాశులకు ప్రయోజనం
కుంభం (Aquarius)-శుక్రుడి ఉదయం వల్ల కుంభ రాశి వారికి మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. జీతం పెరుగుతుంది. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. బిజినెస్ లో రెట్టింపు లాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి (Scorpio)- శుక్ర గ్రహం ఉదయించడం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది. వివిధ వనరుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 

మీనం (Pisces)- మీన రాశి వారికి ఉదయించే శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. విజయాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. చదువు లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు విదేశాల నుంచి డబ్బు వస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.

Also Read: Surya Transit 2022: ఈ ఏడాది చివర్లో సూర్యుడి సంచారం... వీరికి ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News