Shani Dev Blessings: శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే.. ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..

Shani Dev Blessings: శనిదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ఇవీ చేయడం వల్ల శనిదేవుడు మీ కష్టాలన్నింటినీ తొలగించి దేనికీ లోటు లేకుండా చేస్తాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 10:04 AM IST
Shani Dev Blessings: శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే.. ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..

Shani Dev Remedies: శనివారం శనిదేవుడి రోజుగా భావిస్తారు. ప్రతి శనివారం శనిదేవుడిని పూజించడం వల్ల మీ బాధలు, కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే శనిదేవుడు పేరు వినగానే కొందరు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే పనులకు శిక్షలు వేసేవాడు కాబట్టి. అయితే మీరు శనిదేవుడి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. 

శనిదేవుడి అనుగ్రహం పొందడానికి..
సుందరకాండ పఠించండి
ఎవరైతే రామచరితమానస్ మరియు సుందరకాండను క్రమం తప్పకుండా పఠిస్తారో.. వారికి శనిదేవుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అలాంటి వారి పట్ల శనిదేవుడు ఎప్పుడూ దయతో ఉంటాడు.
హనుమాన్ ను పూజించండి
మీరు ఆంజనేయస్వామిని పూజించడం ద్వారా కూడా శని ఆశీస్సులు పొందవచ్చు. మీరు ప్రతి శనివారం లేదా మంగళవారం హనుమంతుడికి కుంకుమ పెట్టండి. 
ఆవనూనె దీపం వెలిగించండి
మీరు శనిదేవుని అనుగ్రహం పొందాలంటే.. ప్రతి శనివారం పీపుల్ చెట్టు క్రింద ఆవాల నూనె దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.

నల్ల నువ్వులు, ఆవాల నూనెను సమర్పించండి
శనివారాల్లో శనిదేవుని ఆలయానికి వెళ్లి ఆయన విగ్రహానికి నల్ల నువ్వులు మరియు ఆవనూనెను సమర్పిస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. 
వికలాంగులకు ఆహారం పెట్టండి
వికలాంగులకు ఆహారం మొదలైన వాటిని క్రమం తప్పకుండా అందించే వారిని శని దేవుడు అనుగ్రహిస్తాడు. నిరుపేదలకు సహాయం చేసే వారికి శనిదేవుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది.

Also Read: Pancha Yogam effect: ఏడు దశాబ్దాల తర్వాత ఐదు మహాయోగాల కలయిక.. ఈ 4 రాశులకు తిరుగులేదు ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News