Shani Gochar 2023: కలియుగ న్యాయమూర్తిగా భావించే శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ సంచారం కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావాలను, మరికొందరిపై ప్రతికూల ప్రభావాలను చూపనుంది. ఆస్ట్రాలజీలో ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఏ రాశి వారి కుండలిలో శని గ్రహం అశుభ స్థానంలో ఉంటుందో వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
శనిదేవుడి సంచారం ఈ రాశులకు సానుకూలం
మేషరాశి (Aries): ఈ రాశి యెుక్క పదవ మరియు పదకొండవ ఇంటికి శనిదేవుడు అధిపతి. వీరి జాతకంలో శనిదేవుడు 11వ ఇంట్లో సంచరించనున్నాడు. దీని కారణంగా మీ కెరీర్ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి యెుక్క రెండవ మరియు మూడవ ఇంటికి శనిదేవుడు అధిపతి. శనిదేవుడు వీరి జాతకంలోని మూడవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. మీకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
తులారాశి (Libra): తుల రాశి వారి ఐదవ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా వ్యాపారస్తులు లాభపడతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.
ఈ రాశులపై శనిదేవుడి ప్రతికూల ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటకం, కన్యా, మకర, కుంభ రాశుల వారు శని దేవుడి సంచారం వల్ల ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వీరు వ్యాపార మరియు వృత్తిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా వీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు.
Also Read: Shani And Jupiter Transit: శని మరియు బృహస్పతి గ్రహాల గమనంలో పెను మార్పు.. ఇక వీరికి లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.