Maha Shivratri 2023 Celebrations Starts in Telangana and AP States: బోళా శంకరుడు అయిన ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు 'మహా శివరాత్రి'. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు ప్రపంచ వ్యాప్తంగా 'మహా శివరాత్రి'ని జరుపుకుంటారు. మహా శివరాత్రి పర్వదినం అంటే.. శివుడికి, ఆయన భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. ఈ ప్రత్యకమైన రోజున ఎవరైతే భక్తితో శివుడిని పూజిస్తూ.. ఉపవాసం, జాగారం చేస్తారో వారిపై పరమశివుడి కటాక్షం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహా శివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి నెలలోనూ 'శివరాత్రి' పండుగ వస్తుంది. అయితే దీనిని 'మాస శివరాత్రి'గా పిలుస్తారు. ఏడాదిలో ఒకేసారి మాఘ మాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి నాడు 'మహా శివరాత్రి' పండగ వస్తుంది. మహా శివరాత్రి పర్వదినం సాధారణంగా ఫిబ్రవరి నెలలో లేదా మార్చి నెలలో వస్తుంది. మహా శివరాత్రి శీతాకాలం ముగింపు, వేసవిల ప్రారంభంలో వస్తుంది. మహా శివరాత్రితో చలిపోతుందని అందరూ అంటుంటారు. ఇక మహా శివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా శివ భక్తులు భావిస్తారు.
నేడు మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు శివుడి దేవాలయాలకు పోటెత్తారు. పరమశివుడికి ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, మహేంద్రగిరి, రామతీర్థం, నర్సీపట్నం, వేములవాడ, కీసర, వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు. శివునికి మహా ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలతో భక్తులు బిజీగా ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు, ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలతో ఆలయాలను సుందరంగా అలంకరించారు.
Also Read: Mohammed Shami: మొహ్మద్ షమీ చెవులు పిండిన ఆర్ అశ్విన్.. నొప్పితో విలలాడిన భారత పేసర్! వైరల్ ఫోటో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.