Lunar Eclipse 2023 In India Date And Time: చంద్రునికి, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఏర్పడే ప్రతిబింబాన్నే చంద్రగ్రహణం అని అంటారు. అయితే ప్రతి సంవత్సరంలో పదుల సంఖ్యలతో సూర్య, చద్రగ్రహాణాలు ఏర్పడుతాయి. ఈ రెండింటికి జ్యోతిష్య శాస్త్రంలో ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చంద్ర గ్రహణం ఏర్పడినప్పుడు అన్ని రాశువారికి చంద్రుడు అనుకూలంగా ఉంటే వ్యక్తుల జీవితాల్లో కూడా తీవ్ర మార్పులు సంభవిస్తాయి. అయితే ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం మే 5న ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 1.34 గంటలకు సంభవిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని ప్రభావం 5 రాశులవారి జీవితాలపై ప్రత్యేక్షంగా పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాశిలపై చంద్రగ్రహణం 2023 ప్రభావం:
కర్కాటక రాశి:
చంద్ర గ్రహం ప్రభావం కర్కాటక రాశివారిపై తీవ్రంగా పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారి మానసిక ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ క్రమంలో కర్కాటక రాశివారికి కుటుంబంలో కలహాలు రావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో శివుడిని పూజించాల్సి ఉంటుంది.
వృషభ రాశి:
చంద్ర గ్రహణం కారణంగా వృషభ రాశివారు తోబుట్టువులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆస్తి పరంగా గొడవలు అయ్యే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మీరు ప్రశాంతత పొందడానికి మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. అంతేకాకుండా మీ కుల దైవానికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
కన్య రాశి:
ఈ గ్రహణం కారణంగా ఉద్యోగంలో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మీ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ఈ క్రమంలో మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ట తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బిజీ కారణంగా బంధువులతో దూరం పెరగవచ్చు.
మేషరాశి:
మేషరాశి వారు తొందరపాటు నిర్ణయం వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇతరులకు అప్పులు ఇవ్వడం వల్ల చాలా నష్టం రావొచ్చు. న్యాయపరమైన వివాదంలో చిక్కుకునే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మానసిక ప్రశాంత కోల్పోయే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సింహరాశి:
సింహరాశి వారు కూడా చంద్ర గ్రహణం కారణంగా చాలా రకాల దుష్ప్రభావాలు ఎదుర్కొంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన అడ్డంకులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook