Budh gochar 2023 effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల ప్రిన్స్ అయిన బుదుడు త్వరలో తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న మెర్క్యూరీ ఈనెల చివరిలో అంగారకుడి రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు బుధుడు మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. జూన్ 7వ తేదీ రాత్రి 7.58 గంటల వరకు మెర్క్యూరీ అదే రాశిలో ఉంటాడు. అనంతరం వృషభరాశిలోకి వెళతాడు. మేషరాశిలో మెర్క్యూరీ సంచారం వల్ల ఏయే రాశులవారికి ప్రయోజనం కలుగనుందో తెలుసుకుందాం.
బుధుడి సంచారం ఈ రాశులకు వరం
మేష రాశి
ఈ రాశి యెుక్క లగ్న గృహంలో బుధుడి సంచారం జరగబోతుంది. ప్రతి పనిలో మిమ్మల్ని విజయలక్ష్మీ వరించనుంది. జాబ్ మారాలనుకునేవారికి ఇదే అనుకూల సమయం. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
మెర్క్యురీ సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ కెరీర్ మునుపటి కంటే బలపడుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
మీన రాశి
మీన రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బుధ సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. మీ కెరీర్ అనుకున్న దానికంటే అద్భుతంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో మెర్క్యూరీ సంచరించనున్నాడు. బుధుడు యొక్క రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మీరు ప్రయోజనం పొందుతారు.
సింహ రాశి
మీ రాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.
Also Read: Surya Gochar 2023: సూర్య గోచారంతో ఏప్రిల్ 14 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook