Vastu Tips: ఇంట్లో తరచూ అశాంతి, చికాకు వేధిస్తుంటే..ఈ చిట్కాలు పాటించండి

Vastu Tips: కొంతమందికి ఇంట్లోకి ప్రవేశిస్తూనే మూడ్ పాడవుతుంటుంది. అశాంతిగా, చికాగ్గా ఫీలవుతుంటారు. ఇంట్లో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అన్పిస్తుంటుంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు వాస్తు నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2023, 06:07 AM IST
Vastu Tips: ఇంట్లో తరచూ అశాంతి, చికాకు వేధిస్తుంటే..ఈ చిట్కాలు పాటించండి

ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు చాలామందికి మానసిక ప్రశాంతత లభిస్తుంటుంది. బాగా మాట్లాడుతారు. తిరిగి ఇంట్లోకి వస్తూనే మూడ్ పాడవుతుంటుంది. చికాకు ప్రదర్శిస్తుంటారు. మూడ్ ఆఫ్ లేదా డిప్రెషన్ ఫీలవుతుంటారు. ఏదో తెలియని నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందేమో అనుకుంటుంటారు. దీనర్ధం మీ గురువు బలహీనంగా ఉన్నాడని..ఇంట్లో అశుభం నెలకొని ఉందని.

సుఖ సంతాషాల కోసం ఈ చిట్కాలు పాటించాలి

ఒకవేళ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు తరచూ పాడవుతుంటే..ఫ్యూజ్ పోతుంటే ఇంటి రాహువు సరిగ్గా లేదని అర్ధం. ఫలితంగా వివిధ ఘటనలు జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఇంటి ముఖ్యమైన స్థలాల్లో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇంట్లో వ్యర్ధాలు పేరుకోకుండా చూడాలి.

పాజిటివ్ సిట్యువేషన్

ఇంట్లో సాయంత్రం వేళ పూజ చేసేచోట దీపం వెలిగించాలి. మొత్తం ఇంట్లో అగరబత్తి, గుగ్గిలం ధూపం వేయాలి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామం వినాలి. ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ చాలావరకూ తగ్గిపోతుంది. 

కొన్ని సందర్బాల్లో ఏ కారణం లేకుండానే గొడవలు జరుగుతుంటాయి. బంధాలు తెగిపోతుంటాయి. మంగళ గ్రహం కుటుంబానికి అనుకూలం కాదు. ఈ పరిస్థితుల్లో సూర్యుడి వెలుగు ఇంట్లో తగినంత ఉండేట్టు చూసుకోవాలి. శనివారం రోజు ఇంట్లోని సుందరకాండ పాఠం, హనుమంతుడికి పూజలు చేయాలి. 

ఒకవేళ మీ ఆదాయం అంతా మందులకే ఖర్చయిపోతుంటే..అకారణంగా వ్యాధి పాలవుతుంటే ఇంటి సూర్యుడు సరిగ్గా లేడని అర్దం చేసుకోవాలి. ఇంట్లో రోజూ ఉదయం 108 సార్లు గట్టిగా గాయత్రి మంత్రం జపించాలి. బోజనానికి ముందు దేవుడికి సమర్పించాలి.

Also read: Shani Sade Sati: మీరు ఇలా చేస్తే శని పీడ నుండి విముక్తి, అంతులేని సంపద

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News