Two Rupees Coin: పాత కాయిన్లు, నాణేలు లేదా పాత నోట్లకు అప్పుడప్పుడూ డిమాండ్ వస్తుంటోంది. కొన్ని నిజాలుంటాయి. కొన్ని అవాస్తవాలుంటాయి. అదృష్టం బాగుంటే ఒక్కోసారి నిజం డబ్బులు కురిపిస్తోంది. ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. పాత రెండు రూపాయల కాయిన్ కోసం..అదేంటో పరిశీలిద్దాం.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. పాత వస్తువులకు ముఖ్యంగా యాంటిక్ పీస్ లైతే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇందులో అవాస్తవం లేనేలేదు. కానీ పాత నోట్లు, పాత కాయిన్లకు కూడా అప్పుడప్పుడూ డిమాండ్ వస్తోంది. ఇందులో అన్నీ వాస్తవాలు కాదు కానీ..కొంతమేర నిజం ఉంటుంది. ఒక్కోసారి ఆ నిజమే డబ్బులు కురిపిస్తుంటుంది. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే నాణేల వాడకం ప్రారంభమైనట్టు చరిత్ర మనకు చెబుతోంది. ఇందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడీ కోవకు చెందిన ఓ వార్త వైరల్ అవుతోంది. నిజం ఎంత ఉందో తెలియదు కానీ...పాత రెండు రూపాయల కాయిన్ (Old Two Rupees Coin) ఉంటే లక్షాధికారి అయిపోవచ్చనేది ఆ వార్త. 1994, 1995, 2000 సంవత్సరాలకు చెందిన 2 రూపాయలు కాయిన్ అయుండాలి. దీనికి ఆన్‌లైన్‌లో 5 లక్షల వరకూ చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారని సమాచారం. బెంగళూరుకు చెందిన క్విక్కర్ వెబ్‌సైట్‌లో( Quikr Website) చాలా మంది ఈ పాత రెండు రూపాయల కాయిన్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక పాత పది రూపాయల నోటు కూడా మంచి ధరే పలుకుతోందట. ఆన్‌లైన్ కాయిన్ బజార్ (Coin Bazar) ప్లాట్‌ఫామ్‌పై అమ్మవచ్చట. ఈ నోటుకు ఓవైపు అశోక స్థంభం, మరోవైపు పడవ ఉండాలి. ఈ నోటు 1943వ సంవత్సరంలో విడుదల చేసుండి...అప్పటి ఆర్బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. అంతేకాదు..పది రూపాయలని ఇంగ్లీషులో నోటు రెండు చివర్లలో వెనుకవైపు రాసుండాలి. ఈ ఫీచర్లున్న నోటు మీ దగ్గరుంటే..కాయిన్ బజార్ ప్లాట్ఫామ్‌లో అమ్మేయవచ్చట.
Also read: Aadhaar and pan card link: పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook