Viral: టర్కీలో వింత సంఘటన...కనిపించడం లేదంటూ తనను తానే వెతుకున్న వ్యక్తి..

Viral: ఓ వ్యక్తి కనిపించకుండా పోయానని చెప్పి...తనను తానే వెతుక్కున్నాడు. ఈ వింత ఘటన టర్కీలో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 08:18 PM IST
  • మిస్సింగ్‌ కేసులో అదిరిపోయే ట్విస్ట్‌
  • కనిపించడం లేదంటూ తనను తానే వెతుకున్న వ్యక్తి
  • టర్కీలో చోటు చేసుకున్న వింత సంఘటన
Viral: టర్కీలో వింత సంఘటన...కనిపించడం లేదంటూ తనను తానే వెతుకున్న వ్యక్తి..

Viral: టర్కీలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కనిపించకుండా పోయానని చెప్పి...తనను తానే వెతుక్కున్నాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.  

వివరాల్లోకి వెళితే..
టర్కీ(Turkey)కి చెందిన బెహాన్ ముట్లు(50) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఇనెగల్ నగరానికి సమీపంలో ఉన్న శయ్యక గ్రామీణ ప్రాంతంలో ఓ పార్టీకి వెళ్లాడు. మద్యం(Alcohol) ఎక్కువగా తీసుకోవడంతో మత్తులో పక్కనే ఉన్న అడవి(Forest)లోకి వెళ్లి.. స్పృహ కోల్పోయాడు. బెహాన్‌ ఎంతకి తిరిగి రాకపోవడంతో.. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్‌ కంప్లైంట్‌(Missing Complaint) నమోదు చేసి.. గాలింపు చర్యలు ప్రారంభించారు. బెహాన్‌ తప్పిపోయిన అటవీ ప్రాంతానికి వెళ్లి.. అతడి పేరును పెద్దగా పిలుస్తూ.. గాలింపు చర్యలు కొనసాగించారు. స్పృహ కోల్పోయిన బెహాన్‌కి అప్పుడే కొద్దిగా మెలకువ వచ్చింది. పూర్తిగా మత్తు వదలలేదు. ఈ క్రమంలో అతడు పోలీసులతో కలిసి బెహాన్‌ గురించి అంటే తన గురించి తానే వెతకడం ప్రారంభించాడు. 

Also Read: Cannibal Couple: 30మందిని పైగా చంపి తిన్న నరమాంస దంపతులు... ఎక్కడంటే..??

మరోసారి పోలీసులు(Police) బెహాన్‌ పేరు పిలవడంతో అతడి మత్తు వదిలింది. ఓ నిమిషం షాక్‌ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు దగ్గరకు వెళ్లి.. ఎవరి గురించి వెతుకుతున్నారని ప్రశ్నించాడు. అప్పుడు పోలీసులు బెహాన్‌ అనే వ్యక్తి అడవిలో తప్పిపోయాడని తెలిపారు. వెంటనే బెహాన్‌.. వారు వెతుకుతుంది(Man Searches For Himself) తన కోసమే అని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు బెహాన్‌ని అతడి ఇంటికి చేర్చారు. ఇక పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్న బెహాన్‌ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియా(Social Media)లో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనలు.. బహుశా ప్రపంచంలోనే తనను తాను వెతుక్కున్న మొదటి వ్యక్తి ఇతడే అయ్యుంటాడు అని కామెంట్‌ చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News