Policeman's Bowling Skills Viral Video: ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఆటగా మాత్రమే కాకుండా ఒక మతంగా పరిగణిస్తారు. ఎందుకంటే మతాలకు అతీతంగా యావత్ భారతీయులు క్రికెట్ ని అంతగా ఆరాధిస్తారు. సరదా సమయం లభించినప్పుడల్లా.. గల్లీ క్రికెట్ నుండి ఢిల్లీ స్థాయి మ్యాచ్‌ల వరకు అన్ని వయసుల వారు ఈ జెంటిల్‌మెన్ గేమ్‌ని ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పుడు అందరూ బ్యాట్, బాల్ పట్టుకుని ఎంజాయ్ చేసిన వాళ్లే. కానీ పెరిగి పెద్దయ్యాకా బతుకుదెరువు కోసం పరుగులు తీసే క్రమంలో కొంతమంది క్రికెట్ కి దూరం కావచ్చునేమో కానీ... ఎప్పుడు అవకాశం వచ్చినా వారిలోని క్రికెటర్ బయటికి వస్తుంటాడు. బ్యాట్ పట్టుకున్నా.. లేక బంతిని పట్టుకున్నా.. తమలోని క్రీడా నైపుణ్యాన్ని నిరూపించుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.
ఒకప్పుడు లోకల్‌కే పరిమితమైన ఈ టాలెంట్, లేదా క్రికెట్ స్కిల్స్.. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి ఎక్కడ, ఎవరిలో, ఎలాంటి ప్రతిభ దాగి ఉన్నా.. అది వారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తమవుతోంది. తాజాగా ఒక పోలీసు వేగంగా బౌలింగ్ చేస్తూ కళ్లు మూసి తెరిచేలోగా వికెట్లు పడగొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఇందులో ఉన్న విశేషం ఏంటంటే... ఈ వీడియోను పోస్ట్ చేసింది మరెవరో కాదు.. స్వయంగా ముంబై ఇండియన్స్ టీమ్. ఔను.. ఐపిఎల్ టోర్నీల్లో ఎనలేని క్రేజ్ ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్స్ తమ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను ముంబై పోలీసులతో షేర్ చేసుకుంటూ అద్దిరిపోయేలా బౌలింగ్ చేస్తున్న ఈ పోలీసులోని బౌలింగ్ స్కిల్స్ ని అభినందించింది.
ప్రాక్టీస్ సెషన్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ వికెట్‌ను పడగొడుతున్న పోలీసు కానిస్టేబుల్ పేరు దుర్జన్ హర్సానిగా పరిచయం చేస్తూ ముంబై ఇండియన్స్ టీమ్ ఈ వీడియోను షేర్ చేసింది.
అయితే, ఈ వీడియో ముంబైలోకి కాకుండా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఓ క్రికెట్ అకాడమీలో రికార్డ్ చేసిన వీడియో అని తెలుస్తోంది. దుర్జన్ హర్సానీలోని బౌలింగ్ స్కిల్స్ చూసి నెటిజెన్స్ సైతం ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తరహాలోనే ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతడు సాధారణంగానే అంత అసాధారణమైన బౌలింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడంటే.. ఇక అతడికి బౌలింగ్ లో శిక్షణ ఇప్పిస్తే ఇంకెంత రాటుదేలిపోతాడో అని నెటిజెన్స్ కాంప్లిమెంట్స్ గుప్పిస్తున్నారు.
'Hello 1️⃣0️⃣0️⃣, we'd like to report a case of 𝐟𝐢𝐞𝐫𝐲 𝐩𝐚𝐜𝐞' 🔥
📽️: Durjan Harsani#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan pic.twitter.com/mKT9QPbO1p
— Mumbai Indians (@mipaltan) August 10, 2023
అంతేకాదు.. వీలైతే ఈ ఆటగాడికి ఐపిఎల్ లో ఆడే అవకాశం ఇవ్వండి అంటూ ఇదే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యాన్ని కోరుతూ ఇంకొంతమంది ట్వీట్ చేశారు. అతడిలోని ఆటగాడిని గుర్తించింది మీరే కనుక మీరే అతడికి అవకాశం కూడా మీరే ఇచ్చి అతడు క్రికెట్ లో పైకొచ్చేందుకు సహకరించండి అంటూ నెటిజెన్స్ నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఇంకొంతమంది నెటిజెన్స్.. ఇంకొన్ని వేరే ఐపిఎల్ ఫ్రాంచైజీలకు ఇతడిని రిఫర్ చేస్తూ.. మీ జట్టులో బౌలర్ల వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇతడికి ఛాన్స్ ఇస్తే మీకు కూడా ఉపయోగపడతాడు అంటూ ట్వీట్ చేయడం కనిపించింది. అంతేందుకు.. రాబోయే రోజుల్లో " ఊ ఈజ్ దుర్జన్ హర్సానీ " అంటూ అతడి గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వైరల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు చూడండి. ఎందుకంటే గతంలో ఇలాగే చాలామందిలోని టాలెంట్ ఇలాగే అనుకోని సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అది దుర్జన్ హర్సానీ వంతు వచ్చింది.. అంతే..