Viral Video, Monocled Cobra laying eggs live on camera: కోళ్లు, పక్షులు మొదలైన కొన్ని పక్షి జాతికి చెందిన జీవులు గుడ్లను పెట్టడం చాలామంది ఎప్పుడోసారి ప్రత్యక్షంగా చూసే ఉంటారు. కోళ్లు, పక్షులు గుడ్లను పొదిగి.. పిల్లలను బయటికి తీయడం కూడా చూసుంటారు. అయితే పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తే చాలామంది అవి ఎప్పుడూ గుడ్లను పెట్టడం చూసుండరు. ఇక పాము గుడ్లను నోటి నుంచి పెడుతుందా లేదా తోక నుంచి పెడుతుందా అని చాలామందికి తెలియదు. అలాంటి వారు ఈ వీడియో చూస్తే పూర్తి క్లారిటీ వస్తుంది.
పాములు తోక వద్ద ఉండే భాగం నుంచి గుడ్లను పెడుతుంది. ప్రతి ఆడ పాము తోక భాగం నుంచే గుడ్లను పెడతాయి. ఓవిపరస్ జాతికి చెందిన మోనోక్లెడ్ కోబ్రా కూడా తోక భాగం నుంచే గుడ్లను పెడుతుంది. మోనోక్లెడ్ కోబ్రా గుడ్లను పెట్టేటప్పుడు బాగా అవస్థలు పడుతుంది. ఓసారి శరీరం భాగం మొత్తాన్ని చుట్టుకుని, మరోసారి పొడవుగా ఉంటూ గుడ్లను పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. నోటితో కూడా తన బాధను వ్యక్తం చేస్తుంటుంది. ఈ వీడియోలో మోనోక్లెడ్ కోబ్రా గుడ్లను పెట్టేటప్పుడు పడే బాధను మనం చూడొచ్చు.
మోనోక్లెడ్ కోబ్రా గుడ్లను పెడుతున్న వీడియోను ఒడిశాలో చాలా ఫేమస్ అయిన స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ (MIRZA MD ARIF) తన సొంత యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోకి కోట్లలో వ్యూస్ వచ్చాయి. అదే స్థాయిలో లైక్స్ కూడా వస్తున్నాయి. పాములు గుడ్లను పెట్టడం చూడటం అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నారు. నేరుగా చూడకపోయినా ఈ దృశ్యంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.
మోనోక్లెడ్ కోబ్రా అనేది ఓవిపరస్ జాతికి చెందినది. ఆడపాములు గుడ్లు పెడతారు. ఇవి వర్షాకాలం తర్వాత సంభోగంలో పాల్గొంటాయి. ఆడపాము జనవరి నుంచి మార్చి మధ్య.. పొడి మట్టి దిబ్బలు, గుహలు లేదా రంధ్రాలలో గుడ్లను పెడతాయి. ఈ పాము 16 నుంచి 33 గుడ్లు పెడుతుంది. సుమారు 2 నెలల పాటు (ఏప్రిల్, జూన్ మధ్య) ఈ గుడ్లను పొదుగుతుంది. మోనోక్లెడ్ కోబ్రా పుట్టినప్పుడు 8 నుండి 12 అంగుళాల పొడవు ఉంటుంది.
Also Read: Amala Paul Bikini Pics: మోనోకినిలో అమలా పాల్.. అంతకు మించి ఎక్స్ పోజింగ్! మరీ ఇంతలానా
Also Read: హాఫ్ శారీలో మెరిసిపోతున్న మాళవిక మోహనన్.. మలయాళ బ్యూటీని ఇలా ఎప్పుడూ చూసుండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook