Men in Sarees Performing Garba Dance: దసరా పండగ, దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు దాదాపుగా ఒకే రకంగా జరుపుకునే సంప్రదాయం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ట్రెడిషన్ కూడా అలాంటిదే. ఇది అలాంటి.. ఇలాంటి ట్రెడిషన్ కాదు.. 200 ఏళ్లుగా పురుషులు చీరలు ధరించి అమ్మవారి ముందు గర్బా డ్యాన్స్ చేసి, అమ్మ కటాక్షం పొందేందుకు ప్రాధేయపడే సంప్రదాయం ఇది. పురుషులు అమ్మవారి ముందు తమలోని అహాన్ని విడిచిపెట్టి, అమ్మ వారి ముందు తలొంచి నిలవడమే కాకుండా.. అచ్చం మహిళల మాదిరిగానే చీరలు ధరించి గర్బా డ్యాన్స్ చేసి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఆరాటపడతారు.
గుజరాత్‌లోని అహ్మెదాబాద్, వదోదరలో పురుషులు ఇలా చీరలు ధరించి అమ్మ వారిని ప్రార్థిస్తారు. తమ తప్పులను మన్నించి తమకు అంతా మంచే జరిగేలా చూడమని వేడుకుంటారు. అమ్మ వారిని ఇలా చీరలు ధరించి ప్రార్థిస్తే.. తప్పకుండా అనుగ్రహం పొందవచ్చనేది అక్కడి పురుషుల విశ్వాసం.
ఇంతకీ ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే దానికొక పెద్ద కథే ఉంది. 200 ఏళ్ల క్రితం సదుబా అనే ఒక మహిళ కొంతమంది పురుషుల చేత ఘోర అవమానానికి గురైందట. ఆ క్షణంలో తనను కాపాడమని ఎంత ప్రాధేయపడినా.. ఎవ్వరూ ఆమెను రక్షించలేదట. అదే సమయంలో ఆమె తన బిడ్డను కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. అక్కడి మగాళ్లందరినీ శపించిందనేది అక్కడి వారి విశ్వాసం.
ఈ కారణంగానే సదు మాత అనుగ్రహం పొందడం కోసం ఆమెకు ప్రత్యేకంగా గుడి కట్టించడంతో పాటు ప్రతీ ఏడాది నవ రాత్రుల సందర్భంగా 8 రోజు రాత్రి.. అంటే అష్టమినాడు రాత్రి ఇలా చీరలు ధరించి గర్బా నృత్యం చేసి సదు మాతను వేడుకుంటుంటారు. చీరల్లో గర్బా డ్యాన్స్ చేసి అమ్మవారిని ప్రార్థిస్తే.. కోరుకున్న కోరికలు, మొక్కులు నెరవేరుతాయనేది అక్కడి వారి గట్టి నమ్మకం. అందుకే ఇలా ప్రతీ ఏడాది పురుషులు వేడుకగా ఈ ఉత్సవాలను జరుపుకుంటుంటారు. ఇలా చీరలు ధరించి గర్బా నృత్యం (Garba Dance Viral Video) చేసే సంప్రదాయం 200 ఏళ్లుగా వస్తోంది. దీనినే శేరి గర్భా అని అంటారు. తమ పూర్వీకుల కాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు ఇక్కడ సదు మాతను ఇష్టదైవంగా కొలిచే పురుషులు.
Also Read : Viral Video: అబ్బాయే కానీ.. అమ్మాయిలా డాన్స్ అదరగొట్టాడు పో! ఫిదా అవుతున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి