Pavithra Lokesh: రాత్రిపూట నరేష్ ఎనర్జీని తట్టుకోలేను.. బాంబు పేల్చిన పవిత్ర లోకేష్ .. మ్యాటర్ ఏంటంటే..?

Pavithra lokesh on naresh: నటి పవిత్ర లోకేష్ హీరో నరేష్ ఎనర్జీ లెవల్స్ గురించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్  మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
 

1 /6

సీనియర్ నటుడు నరేష్ 52వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో నటి పవిత్ర లోకేష్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. నరేష్ చాలా కష్టపడుతారని, పది మంది పడే కష్టాన్ని ఆయన ఒక్కరే పడుతారన్నారు. ప్రతి దాంట్లో కూడా తన వంద శాతం ఎఫోర్ట్స్ పెడుతారన్నారు.  

2 /6

అంతే కాకుండా.. ఆయన ఎనర్జీ లెవల్స్ వేరని .. ఆయన పడుతున్న స్ట్రగుల్ ను దగ్గరుండీ చూస్తున్నట్లు చెప్పారు. రాత్రి అయితే తాను ఇంకా ఆ ఎనర్జీ లెవల్స్ భరించలేనని.. ఇక మూవీ టీమ్ కు మీరు చూసుకొవాలని చెప్తానన్నారు.   

3 /6

మూవీస్ పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం, నిజాయితీ పట్టుదల, డిసిప్లెన్ వల్ల ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు. అంతే కాకుండా.. నరేష్ కు బర్త్ డే కానుకగా షర్ట్ కొనిచ్చి ఇచ్చానని చెప్పారు. మరోవైపు నరేష్ సైతం.. పవిత్ర లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. 

4 /6

పవిత్ర లోకేష్ తన లైఫ్ లో వచ్చాక... తన జీవితం టైటానిక్ ఓడలా ఒడ్డుకు చేరుకుందన్నారు. తన వల్ల ఇంకా మూవీస్ తీస్తున్నానని అన్నారు . నిరంతరం వెనకుండీ ప్రొత్సహిస్తుందని పవిత్రపై ప్రశంసలు కురిపించారు.  అదే విధంగా తన గురువైన.. జంధ్యాల గారిని  ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటానని చెప్పారు.

5 /6

 ఏదైన సీన్ కష్టంగా అన్పిస్తే.. వెంటనే గురువుగారిని స్మరించుకుంటానని దీంతో ఇట్టే ఈజీగా అయిపోతుందన్నారు. మరోవైపు విజయ్ నిర్మల బయోపిక్ తీయాలని ఉందని, దీనిపై తప్పనిసరిగా ముందుకు వెళ్తానన్నారు.

6 /6

ఇదిలా ఉండగా సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం 9 సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ఇక మరోవైపు నరేష్ తన తల్లి బంగారు కాళ్లను ప్రతిరోజు దండంపెట్టిన తర్వాత మరేపని అయిన చేస్తాడని పవిత్ర లోకేష్ చెప్పారు. దీంతో పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.