Cheetah Found In Hyderabad: హైదరాబాద్‌లో చిరుతపులి కలకలం రేపింది. తెల్లవారుజామున వాకింగ్ కోసం వెళ్లిన వాకర్లకు పులి కనిపించింది. దీంతో అక్కడ భయాందోళన ఏర్పడింది. ఈ సమాచారం అందడంతో స్థానికంగా ప్రజల్లో కూడా భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ వార్త హైదరాబాద్ వ్యాప్తంగా చుట్టుమట్టడంతో వైరల్‌గా మారింది. పోలీసులు, వాకర్లు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Old 100 Note: లక్కంటే ఇదే! ఒకే ఒక వంద నోటుకు ఏకంగా రూ.56 లక్షలు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అటవీ ప్రాంతం అధికంగా ఉండడంతో కొన్ని వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. ఈ ప్రాంతంలో నిత్యం స్థానికులతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు వాకింగ్ చేస్తుంటారు. యథావిధిగా సోమవారం ఉదయం విశ్వవిద్యాలయం ఆవరణలో వాకర్లు వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాకర్లకు చిరుతపులి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వాకర్లు భయబ్రాంతులకు గురయ్యారు.
Also Read: Sankranti: సంక్రాంతికి పండుగకు సీఎం చంద్రబాబు దూరం? ఎందుకో తెలుసా?
వాకింగ్ చేయడానికీ వచ్చిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి తాను ప్రత్యక్షంగా చిరుతపులిని చూసినట్లు వెల్లడించాడు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి అక్కడి నుండి చెట్లలోకి వెళ్లిపోయిందని తెలిపాడు. ఈ విషయాన్ని మిగతా వాకర్లకు చెప్పడంతో వారంతా భయాందోళన చెందారు. కనిపించింది చిరుతపులా కాదా? అని తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అక్కడ పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో పులి అని ధ్రువీకరించారు.
గతంలో ఇదే ప్రాంతంలో గగన్ పహాడ్ వద్ద చిరుత సంచరించిన విషయం తెలిసిందే. శంషాబాద్, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో తిరుగుతున్నది ఒకటే చిరుతపులి అని అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో పెద్ద పెద్ద కొండలు.. అటవీ ప్రాంతం ఉండడంతో చిరుతపులులు సంచరించే అవకాశాలు ఉన్నాయి. అధికారులు ఈ ప్రాంతంపై సంచరిస్తున్న చిరుతను బంధించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అయితే కనిపించింది చిరుతపులా? లేదా వేరే ఏదైనా జీవినా అనేది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.