Agnipath Protest: అగ్నిపథ్ ఆందోళనలు దేశవ్యాప్తంగా హింసాత్మకమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మధురలో జరిగిన హింసాత్మక ప్రదర్శనల్లో చిన్న బిడ్డను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి వీడియా వైరల్ అవుతోంది.
అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రైళ్లు తగలబెట్టారు. వాహనాలు, ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేశారు. ప్రదర్శనకారులు పెద్దఎత్తున రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలయ్యాయి. ఓ వైపు హింసాత్మక ప్రదర్శనలు చెలరేగుతుండగానే..ప్రభుత్వం గరిష్ట వయస్సు పరిమితిని 21 నుంచి 23కు పెంచింది.
బీహార్ నుంచి హర్యానా వరకూ ఆగ్రా నుంచి గ్వాలియర్ వరకూ..ఇలా దేశవ్యాప్తంగా పదికి పైగా రాష్ట్రాల్లో హింసాత్మక ప్రదర్శనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. త్రివిధ దళాల్లో చేరాలనుకున్న వందలాది అభ్యర్ధులు వీధ్లులోకొచ్చి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్థుల్ని టార్గెట్ చేశారు. అలీగడ్, ఆగ్రా, బులంద్ షహర్, మధుర, ఫిరోజాబాద్, బాలియా జిల్లాల్లో భారీగా నిరసనన ప్రదర్శనలు జరిగాయి. పెద్దఎత్తున రాళ్లు రువ్వారు. మధురలో ఇవాళ శుక్రవారం నాడు ప్రదర్శనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుతుండటంతో..సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఓ వ్యక్తి చిన్న బిడ్డను ఎత్తుకుని కుటుంబంతో సహా..తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ..పరుగులెట్టడం, అక్కడున్న సాయుధ బలగాలు సహాయం చేసిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసుల రక్షణలో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు పరుగెట్టడం కెమేరా కంటికి చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు ప్రదర్శనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
A man runs for cover with his child during stone pelting on the national highway in Mathura , UP by #AgneepathScheme protestors … pic.twitter.com/nvpxPb0jI5
— Alok Pandey (@alok_pandey) June 17, 2022
Also read: Agnipath Recruitment: ఎయిర్‌ఫోర్స్, ఆర్మీల్లో అగ్నిపథ్ నియామకాలు ఎప్పుడో తెలుసా
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.