YS Jagan Vijayamma: ఒక్కటైన తల్లీకొడుకులు.. తొలిసారి కలుసుకున్న వైఎస్‌ జగన్‌, విజయమ్మ

YS Jagan YS Vijayamma First Meet A Head Of Family Assets Row: వైఎస్‌ కుటుంబంలో ఆస్తుల వివాదం తర్వాత తొలిసారి తల్లీ కొడుకులు కలుసుకున్నారు. ఒకే వేదికగా వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌ కనిపించారు. క్రిస్మస్‌ వేడుకల్లో ఈ తల్లీ కొడుకులు కలిసి పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

1 /9

కొన్ని వారాల పాటు వైఎస్‌ కుటుంబంలో తీవ్రస్థాయిలో ఆస్తుల వివాదం నడిచిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వారి కుటుంబ వ్యవహారం సంచలనంగా మారింది.

2 /9

వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మ ఒకవైపు.. వైఎస్‌ జగన్‌ ఒకవైపు ఉండి ఒక యుద్ధం మాదిరి వారి కుటుంబ వివాదం నడిచింది.

3 /9

ఈ వివాదంతో వైఎస్‌ జగన్‌కు తల్లి విజయమ్మతోపాటు చెల్లెలు షర్మిల దూరమయ్యారని అందరూ భావించారు. కానీ క్రిస్మస్‌ వేడుకలు ఆ తల్లీ కుమారులను కలిపింది.

4 /9

ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్‌ విజయమ్మ, జగన్‌ కలుసుకున్నారు.

5 /9

తన తల్లి విజయమ్మ కనిపించగానే మొదట జగన్‌ వెనకాడారు. తర్వాత తల్లి వద్దకు వెళ్లి కలవగా.. విజయమ్మ జగన్‌ను ముద్దు చేశారు.

6 /9

తల్లి తరఫు కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పలకరించారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

7 /9

ఈ ప్రార్థనల్లో జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి కూడా ఉన్నారు. విజయమ్మకు దూరంగా భారతి కూర్చున్నారు.

8 /9

తల్లీకొడుకులు కలుసుకున్నా కానీ అన్యమనస్కంగానే ఉన్నారు. గతంలో ఉన్నంత ప్రేమాప్యాయతతో జగన్‌, విజయమ్మ, భారతి కనిపించలేదు.

9 /9

క్రిస్మస్‌ వేడుకల అనంతరం వైఎస్‌ జగన్‌ కుటుంబసభ్యులతో దిగిన ఫొటో వైరల్‌గా మారాయి. వైఎస్‌ విజయమ్మ, భారతి, కుమార్తెలతోపాటు ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.