World Chess Championship: చెస్‌ ఛాంపియన్‌ గుకేశ్‌ ఫ్రైజ్‌ మనీ తెలుసుకుంటే షాక్‌ అవ్వడం పక్కా.. ఏకంగా ధోనీని మించిపోయాడుగా

 D. Gukesh Prize Money: 18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెప్ ఛాంపియన్ గా నిలిచాడు గ్రాండ్ మాస్టర్ డి. గుకేష్. అతను సాధించిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రపతి నుంచి సామాన్య ప్రజలకు వరకు గుకేవ్ విజయాన్ని అభినందిస్తున్నారు. సింగపూర్ లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో 14వ రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ఓడించి గుకేశ్ ఈ టైటిల్ ను అందుకున్నాడు. అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా టైటిల్‌ను సాధించాడు. ఈ విజయం తర్వాత గుకేష్‌ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. 
 

1 /7

D. Gukesh Prize Money: సాధారణంగా భారత్ లో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ క్రికెటర్ల గురించే వారి మధ్య సంభాషణ జరుగుతుంది. క్రికెట్ తోపాటు ఇతర క్రీడల్ల కూడా కొత్త ఆటగాళ్లు వస్తుంటారు. కొంతమంది మన దేశాన్ని ప్రపంచపటంలోకి ఎక్కేలా చేసినవారూ ఉన్నారు. తాజాగా వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ తో గుకేశ్ ప్రపంచం గర్వించేలా చేశారు.

2 /7

చదరంగం అంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలి. ఈ గేమ్ పేరు వినగానే భారతీయులందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది విశ్వనాథన్ ఆనంద్. ఇప్పుడు ఓ కొత్త ఇండియన్ చెస్ ప్లేయర్ ముందుకు వచ్చాడు. 18 ఏళ్ల డి గుకేష్ కంటే డిసెంబరు 12న ఇలాంటి చారిత్రాత్మక ఫీట్‌ని ప్రదర్శించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

3 /7

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 ఫైనల్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా డి గుకేష్ ఈ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన చెస్ ప్లేయర్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. గెలుపొందినందుకు గుకేష్‌కు పెద్ద ప్రైజ్ మనీ కూడా వచ్చింది.  

4 /7

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్ మనీ కలిగిన క్రీడా ఛాంపియన్‌షిప్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకునే ఆటగాళ్లకు రూ. 21 కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది. ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్ కు ట్రోఫీతోపాటు 13లక్షల 50వేల డాలర్లు అదనంగా రూ. 5.7కోట్లు అందుకున్నాడు.   

5 /7

మొత్తంగా అతనికి రూ. 16.52కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్ డింగ్ లిరెన్ 11 లక్షల 50వేల డాలర్ల నగదును అందుకున్నాడు.ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్ మనీ కలిగిన ట్రోఫీ అని చెప్పవచ్చు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకునే ఆటగాళ్లకు రూ. 21 కోట్లు ఇస్తాడు. గెలిచిన వారికి 11 కోట్లపైనా ఇస్తారు. 

6 /7

భారత ఆటగాడు డి గుకేష్ వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలవడంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న ధోనీకి దక్కుతుంది 4 కోట్ల రూపాయలు మాత్రమే.. ఇటు గుకేశ్‌కు రూ.11.75 కోట్లు దక్కడంతో అతను ధోనీని మించిపోయాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

7 /7

చెస్  అంతర్జాతీయ సంస్థ FIDE నిబంధనల ప్రకారం, ఫైనల్‌లో ఆడే ఆటగాళ్లిద్దరూ ఇక్కడికి చేరుకోవడానికి ప్రయాణించేటప్పుడు వారు గెలిచిన అన్ని మ్యాచ్‌లకు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ఇందులో డి గుకేష్‌కు రూ. 11.45 కోట్ల ప్రైజ్ మనీ లభించగా, అందులో ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం రూ. 5.07 కోట్లను పొందగా, మూడు మ్యాచ్‌లలోని విజయాన్ని కూడా ఈ ప్రైజ్ మనీలో చేర్చి అతనికి అందించారు.