Curd For White Hair: తెల్ల జుట్టు సమస్య అందరినీ వేధిస్తుంది. అయితే దీనికి ఎన్నో కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.. హెయిర్ డై ఉపయోగిస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. అయితే ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. పెరుగుతో తెల్ల జుట్టు సమస్యకు ఎలా చెక్ పెట్టాలి తెలుసుకుందాం..
పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. అంతేకాదు పెరుగులో క్యాల్షియం కూడా ఉండటం వల్ల తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెడుతుంది. మన ఎముకలో కూడా ఆరోగ్యం.
తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు వారు కోకొల్లలు. 20 ఏళ్ళు రాగానే తెల్ల జుట్టు సమస్య ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వారికి క్యాల్షియం లోపం లేదా రక్తహీనత వల్ల ఇలా తెల్ల జుట్టు సమస్య వస్తుంది.
దీనికి కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్, హెయిర్ డై ఉపయోగిస్తారు. కానీ సరైన ఫలితం లభించదు. నేచురల్‌గా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి పెరుగు మంచి చిట్కా.
పెరుగులో ఆవాల నూనె, నిమ్మరసం కలిపి జుట్టు అంతటికీ అప్లై చేయాలి. కుదుళ్ల నుంచి చివర్ల అప్లై చేసిన తర్వాత జుట్టును కవర్ చేసుకోవాలి.
జుట్టు అంతా బాగా ఆరిన తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వల్ల తెల్ల జుట్టు సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది..