Weight Loss - Garlic: బరువు తగ్గించుకోవడానికి మన దగ్గర చాలా మంది ఉదయమే లేచి పరుగులు పెట్టడం.. వాకింగ్ చేయడం.. జిమ్‌లో గంటల కొద్ది కసరత్తుల చేయడం వంటివి చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గడం లేదా.. వెంటనే వెల్లుల్లి (ఎల్లిపాయ)తో ఈ చిట్కాలు పాటించండి.
Weight Loss - Garlic: ప్రపంచంలో అత్యధిక మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. సన్నగా, నాజూగ్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం కడుపు మాడ్చుకుంటారు కూడా. కొంత మంది తినే అన్నం మానేసి కేవలం పండ్ల రసాలనే ఆహారంగా తీసుకుంటారు. మరికొంత మంది పచ్చి కూరగాలయ రసం వంటివి తీసుకుంటూ ఉంటారు. వీటిన్నటి కంటే వెల్లుల్లిని వాడితే అంత కంటే సులభమైన మార్గంలో బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.
మన దేశంలో పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు అందరి ఇళ్లల్లో వెల్లుల్లి కామన్‌గా కనిపిస్తూ ఉంటుంది. భారతీయులు తమ వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా వాడుతుంటారు. దీన్ని మన వంట్లో ఎక్కువగా వాడుతుంటారు. అటు ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బలమైన ఘాటు వాసన కారణంగా కొంత మందికి నచ్చదు. కానీ వాటి వాడకంతో ఎంతో సులభంగా బరువు తగ్గవచ్చని పలు పరిశోధల్లో తేలింది.
వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్యాలను తగ్గిస్తుంది. లోబీపీ, జలుబుతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అంతేకాదు నడుము చుట్టు ఉండే కొవ్వును తగ్గిస్తుంది.
వెల్లుల్లిలో విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించుకోవడంలో సాయపడతాయి. ఇందులో ఉండే ప్రత్యేక గుణాలు లేడీస్ బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయని.. ప్రముఖ న్యూట్రిషన్ పత్రిక 'ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన విషయాన్ని విశ్లేషకులు, డాక్టర్లు చెబుతున్నారు.
8 వారాల పాటు ఎలుకలపై ప్రయోగించినపుడు వాటి శరీరం బరువు, కొవ్వు నిల్వలు శాతం తగ్గినట్టు పరిశీధనలో తేలింది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని, అంతేకాదు పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తోంది. జలుబు, ఫ్లూ వంటివి తగ్గించడానికి ఉపయోగపడతాయి. రోజు ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడంతో శరీర స్థాయితో పాటు జీవక్రియ రేటు కూడా పెరుగుతోంది.
వెల్లుల్లితో బరువు తగ్గడానికి 3 ప్రయత్నాలు చేయండి.. 1. రెండు మూడు వెల్లుల్లి రేకలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. రాత్రి పడుకునే ముందు వాటిని ఒక గ్లాసులో వాటిని వేయాలి. ఉదయమే ఆ నీటి నుంచి వెల్లుల్లి ముక్కలను తీసివేసి నల్లని మిరియాల పొడి వేసి కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే ఏమి తినకముందే తీసుకోవాలి.
వెల్లుల్లి మంచిదని.. అదే పనిగా ఎక్కువగా వాడితే కొన్ని దుష్ప్రయోజనాలున్నాయి. దీని వాడకం ఎక్కువైతే కడుపులో మంట, శరీరం దుర్వాసన, డయేరియా, వాంతులు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే రెండు మూడు మించి వెల్లుల్లిని తీసుకోకపోవడం ఉత్తమం